Kalki 2898 AD : ‘కల్కి’ సినిమా రిలీజ్‌కి ముందే సిరీస్ రిలీజ్.. పిల్లల కోసం స్పెషల్‌గా.. థియేటర్స్‌లో ఒక రోజు ముందే..
ఇటీవల బుజ్జి అండ్ భైరవ అని పిల్లలతో కలిసి ఉన్న ఓ ప్రోమోని అమెజాన్ ప్రైమ్ నుంచి విడుదల చేసారు.

Kalki Bujji and Bhairava Animation Series Releasing in Amazon Prime
Kalki 2898 AD : కల్కి సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. ఇటీవల కల్కి సినిమా నుంచి బుజ్జి అని ప్రభాస్ వెహికల్ ని పరిచయం చేసి గ్రాండ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుందని ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కల్కి సినిమా రిలీజ్ కంటే ముందే కల్కి యానిమేషన్ సిరీస్ ని రిలీజ్ చేయబోతున్నారు.
ఇటీవల బుజ్జి అండ్ భైరవ అని పిల్లలతో కలిసి ఉన్న ఓ ప్రోమోని అమెజాన్ ప్రైమ్ నుంచి విడుదల చేసారు. అందులో బుజ్జి అండ్ భైరవ అంటే ప్రభాస్, ఆ వెహికల్ పాత్రలతోనే ఓ యానిమేషన్ సిరీస్ కూడా రూపొందించినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయో చెప్పలేదు కానీ మే 31 నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇది స్పెషల్ గా పిల్లల కోసం అని కూడా చెప్తున్నారు.
నేడు దేశంలోని పలు నగరాల్లో ఒక రోజు ముందే ఈ యానిమేషన్ సిరీస్ ని థియేటర్స్ లో స్ట్రీమింగ్ కూడా చేస్తున్నారు. అయితే కేవలం ఒక్క ఎపిసోడ్ మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. మిగిలినవి అమెజాన్ ఓటీటీలో చూడాల్సిందే. దీంతో కల్కి సినిమాపైనే భారీ బడ్జెట్, భారీ అంచనాలు అనుకుంటే సైలెంట్ గా యానిమేషన్ సిరీస్ కూడా తీసేసారు కదా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ పిల్లలను అట్రాక్ట్ చేయడానికి, సినిమా మీద మరింత హైప్ కోసం అని తెలుస్తుంది. ఏది ఏమైనా కల్కి సినిమా ప్రమోషన్స్ లో ఓ కొత్త ఒరవడి చూపిస్తుంది.
Catch a glimpse of #BujjiAndBhairava on May 30.
?????????? ?????’? ????? ???? ??????? ????????? ?????? ????????? ??????? -? before it streams on @PrimeVideoIN!#BujjiAndBhairavaOnPrime #Kalki2898AD#Prabhas… pic.twitter.com/eCZ9I119P0
— Kalki 2898 AD (@Kalki2898AD) May 29, 2024