Manchu Manoj's interesting comments on Mirai 2
Manchu Manoj: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మిరాయ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఏకంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. సినిమాకు యునానిమస్ పాజిటీవ్ టాక్ రావడంతో రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే, మిరాయ్ సినిమాకు కొనసాగింపుగా మిరాయ్ 2 కూడా ఉండనుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మిరాయ్ 2 గురించి, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్.
OG Trailer: మోస్ట్ అవైటెడ్ ఓజీ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
ఈనేపథ్యంలోనే తాజాగా మిరాయ్ సినిమా గురించి, సీక్వెల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు మంచు మనోజ్(Manchu Manoj). ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..”మిరాయ్ సినిమాలో బ్లాక్ స్వార్డ్ జీవించే ఉండాలి. క్లైమాక్స్ చూస్తున్నప్పుడు చాలా మంది మర్చిపోయిన విషయం ఏంటంటే? తొమ్మిది గ్రంథాలు తనను అజేయంగా చేస్తాయని బ్లాక్ స్వార్డ్ చాలు సార్లు చెప్తాడు. కాబట్టి, సినిమా చివర్లో బ్లాస్ట్ జరిగింది కానీ, తొమ్మిది గ్రంధాలు అతనికి కవచంలా ఉంటాయి. రావణుడిని కూడా రాముడు ఒక్క బాణంతో ఓడించలేదు. ఒక మాహా యుద్ధమే జరిగింది.
ఇదే విషయాన్ని సినిమాలో శ్రియా శరణ్, జగపతి బాబు పాత్రలు చెప్తాయి. ఇంకా యుద్ధం జరగలేదనే అంటాయి. కాబట్టి.. వేద, మహాబీర్ మధ్య యుద్ధం ఇంకా ఉందని చెప్పడానికి అదే అతిపెద్ద సూచన. సినిమా చివర్లో వేద బాణం వేశాడు కానీ, మహాబీర్ కాలును గానీ, తలను గానీ కొట్టలేదు. నాభిపై బాణం వేస్తేనే రావణుడి మరణించాడు. ఇక్కడ కూడా అలాంటిదే జరగాలి. కాబట్టి, సినిమాలో నా పాత్రపై సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఈ మిరాయ్ ఫ్రాంచైజీలో బ్లాక్ స్వార్డ్ కోసం కార్తీక్ ఘట్టమనేని వద్ద పెద్ద ప్లానే ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో మంచు మనోజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. మిరాయ్ 2 సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.