OG Trailer: మోస్ట్ అవైటెడ్ ఓజీ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(ఓజాస్ గంభీర)(OG). స్టైలీష్ డైరెక్టర్ (OG Trailer)సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.

OG Trailer: మోస్ట్ అవైటెడ్ ఓజీ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?

Pawan Kalyan's OG trailer to be released on September 21st

Updated On : September 18, 2025 / 3:32 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(ఓజాస్ గంభీర)(OG). స్టైలీష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ అంచనాలు భారీగా పెంచేయగా.. ఓజీ ట్రైలర్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Bobby: సినిమా చూసి చెప్తున్నా.. చిరు-అనిల్ సినిమాపై బాబీ ఆసక్తికర కామెంట్స్

ఈనేపథ్యంలోనే తాజాగా ఓజీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 21న ఉదయం 10:08 నిమిషాలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి గన్ పట్టుకొని ఉన్న పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఉన్న అంచనాలను చూస్తుంటే ట్రైలర్ తరువాత ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.

Pawan Kalyan's OG trailer to be released on September 21st