Bobby: సినిమా చూసి చెప్తున్నా.. చిరు-అనిల్ సినిమాపై బాబీ ఆసక్తికర కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో(Bobby) "మన శంకర వరప్రసాద్ గారు" అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Bobby: సినిమా చూసి చెప్తున్నా.. చిరు-అనిల్ సినిమాపై బాబీ ఆసక్తికర కామెంట్స్

Director Bobby makes interesting comments on Chiru-Anil's movie

Updated On : September 18, 2025 / 3:04 PM IST

Bobby: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడితో “మన శంకర వరప్రసాద్ గారు” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నయనతార హీరోయినిగా నటిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ కి ఆడియన్స్ నుంచి క్రేజ్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ లుక్ లో చిరు కనిపించడంతో ఆడియన్స్ వివరీతంగా ఎంజాయ్ చేశారు. (Bobby)అలాగే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది ఈ టీజర్. అప్పటినుంచి ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా సోషల్ మిడియాలో ట్రెండ్ అవుతోంది.

OG: ఓజీ నుంచి ప్రకాష్ రాజ్ పోస్టర్ రిలీజ్.. షాక్ లో పవన్ ఫ్యాన్స్.. అసలు ఎం జరుగుతుంది?

ఈనేపథ్యంలోనే తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు మాస్ దర్శకుడు బాబీ కొల్లి. ఇటీవల ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన కిష్కిందపురి సినిమా సక్సెస్ మీట్ కి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్‌ కొట్టబోతోంది. నేను ఈ మూవీలోని కొన్ని సీన్స్‌ నేను చూశాను. నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. అందుకే, ఈ మాట చెబుతున్నా. మెగాస్టార్‌ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అని చెప్పుకొచ్చారు బాబీ. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక బాబీ విషయానికి వస్తే, గతంలో ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో “వాల్తేరు వీరయ్య” సినిమా చేసిన విషయం తెలిసిందే. ఎమోషనల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఆ కాంబో తెరపైకి రానుంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు దసరా రోజు జరగనున్నాయని ఇండస్ట్రీ టాక్.