OG: ఓజీ నుంచి ప్రకాష్ రాజ్ పోస్టర్ రిలీజ్.. షాక్ లో పవన్ ఫ్యాన్స్.. అసలు ఎం జరుగుతుంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(ఓజాస్ గంభీర). (OG)టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.

OG: ఓజీ నుంచి ప్రకాష్ రాజ్ పోస్టర్ రిలీజ్.. షాక్ లో పవన్ ఫ్యాన్స్.. అసలు ఎం జరుగుతుంది?

Prakash Raj poster released from the movie OG Movie

Updated On : September 18, 2025 / 2:31 PM IST

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(ఓజాస్ గంభీర)(OG). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. గ్యాంగ్ స్టార్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం, పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఫస్ట్ టైం గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తుండటం, రిట్రో బ్యాక్డ్రాప్, తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇలా చాలా విషయాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఓజీపై క్రియేట్ అయినంత క్రేజ్ మరే సినిమాకు రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Mirai: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న మిరాయ్.. అయిదు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్

పాన్ ఇండియా లెవల్లో ఓజీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచిన మేకర్స్ తాజాగా ఓజీ నుండి ప్రకాష్ రాజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన సత్యదాదా పాత్రలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్ లుక్ కూడా చాలా గంభీరంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ, ఓజీ నుంచి ప్రకాష్ రాజ్ లుక్ విడుదల కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

దానికి కారణం రాజకీయంగా వీడిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయి. నిన్నమొన్నటివరకు కూడా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తి పవన్ సినిమా చేశాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ గానీ, ప్రకాష్ రాజ్ గానీ ఎప్పుడు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా సినిమా మాత్రం అందరిదీ అనే భావనతో ఉంటారు. కాబట్టి, ఓజీ సినిమా విషయంలో అదే జరిగి ఉంటుంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్ ఈ సినిమాలో నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాకు విడుదల తరువాత ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.