Mohan babu : సినీ న‌టుడు మోహ‌న్‌బాబుకు సుప్రీం కోర్టులో ఊర‌ట‌..

సినీ న‌టుడు మోహ‌న్ బాబుకు సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట ల‌భించింది.

Actor Mohan babu got relief in the Supreme Court

Mohan Babu Attacks Journalist Case: సినీ న‌టుడు మోహ‌న్ బాబుకు సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట ల‌భించింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. తదుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జ‌ర్న‌లిస్టు పై దాడి కేసులో మోహ‌న్ బాబు దాఖ‌లు చేసిన ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను గ‌త నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దాన్ని స‌వాల్ చేస్తూ ఆయ‌న సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.

సినీ నటుడు మోహన్ బాబు తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి వాద‌న‌లు వినిపించారు. కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగిందన్నారు. జర్నలిస్ట్ పై జరిగిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు. నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, కావాల‌ని దాడి చేయాల‌ని న్యాయ‌స్థానానికి తెలిపారు. జ‌ర్న‌లిస్టులు బ‌ల‌వంతంగా ఇంట్లోకి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్ర‌శ్నించింది.

OG Glimpse : ప‌వ‌న్ అభిమానుల‌కు సంక్రాంతి ట్రీట్‌..! ఓజీ గ్లింప్స్ రెడీ?

జ‌ర్న‌లిస్ట్ త‌రుపున న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపించారు. దాడి జ‌ర‌గ‌డంతో ఐదు రోజులు ఆస్ప‌త్రిలో ఉన్న‌ట్లు చెప్పారు. సర్జరీ జరిగిందని, నెల రోజులు పైప‌పు ద్వారానే ఆహారాన్ని తీసుకున్న‌ట్లు తెలిపారు. దాడి చేయడమే కాకుండా కించపరిచిన‌ట్లు జ‌ర్న‌లిస్ట్ త‌రుపు న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు. ప్రొఫెషనల్ గా నష్టం జరిగిందన్నారు.

నష్టపరిహారమా లేక జైలా..?

నష్టపరిహారం కావాలా జైలుకు పంపాలా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్ర‌శ్నించింది. ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో తీర్పును ఇస్తామని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

Daaku Maharaaj Pre Release Event update : బాల‌య్య ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. వెల్ల‌డించిన మేక‌ర్స్‌.. కార‌ణం ఇదే..

ఏం జ‌రిగిందంటే..?

మంచు ఫ్యామిలీలో గొడ‌వ‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్‌బాబుకు ఆయ‌న చిన్న కొడుకు మంచు మ‌నోజ్‌కు మ‌ధ్య విభేదాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో 2024 డిసెంబ‌ర్ 10న మోహ‌న్ బాబు ఇంటికి మ‌నోజ్ వెళ్లాడు. సెక్యూరిటీ సిబ్బంది మ‌నోజ్‌ను ఇంట్లోకి వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకున్నారు. దీంతో ఆగ్ర‌హానికి లోనైన మ‌నోజ్ బ‌ల‌వంతంగా గేట్ల‌ను తోసుకుంటూ లోనికి వెళ్లాడు. ఈ క్ర‌మంలో మోహ‌న్ బాబు నివాసం వద్ద ఉద్రిక‌త్త చోటు చేసుకుంది.

అక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను క‌వ‌ర్ చేసేందుకు వెళ్లిన మీడియా పై మోహ‌న్ బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ జ‌ర్న‌లిస్టు పై దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో రిపోర్ట్‌కు గాయాలు అయ్యాయి. జ‌ర్న‌లిస్ట్ ఫిర్యాదు మేర‌కు మోహ‌న్ బాబుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహ‌న్ బాబు తెలంగాణ హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. దీంతో ఆయ‌న‌ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించ‌గా త‌ద‌రుప‌రి విచార‌ణ వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరాదంటూ దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది.