Daaku Maharaaj Pre Release Event update : బాల‌య్య ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. వెల్ల‌డించిన మేక‌ర్స్‌.. కార‌ణం ఇదే..

తాజాగా డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు చిత్ర బృందం తెలిపింది.

Daaku Maharaaj Pre Release Event update : బాల‌య్య ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. వెల్ల‌డించిన మేక‌ర్స్‌.. కార‌ణం ఇదే..

Nandamuri Balakrishna Daaku Maharaaj Pre Release Event cancelled

Updated On : January 9, 2025 / 10:13 AM IST

నంద‌మూరి న‌టసింహం న‌టిస్తున్న మూవీ డాకు మ‌హారాజ్‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు (గురువారం) గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా రానున్న ఈ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా ఈ ఈవెంట్‌కు ర‌ద్దు చేసిన‌ట్లు చిత్ర బృందం తెలిపింది.

బుధ‌వారం తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌నలో ప‌లువురు భ‌క్తులు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. తిరుమ‌ల ఘ‌ట‌న నేప‌థ్యంలో డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

Chiranjeevi : సంక్రాంతికి మెగాస్టార్‌తో ముగ్గురు హీరోలు..

‘మ‌న సంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లే తిరుప‌తి క్షేత్రంలో అలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం బాధాక‌రం. మా వేడుక‌ను నిర్వ‌హించుకోవ‌డానికి ఇది స‌రైన త‌రుణం కాదు. భ‌క్తులను, వారి మ‌నోభావాలను గౌర‌విస్తున్నాం. అందుకే డాకు మ‌హారాజ్ ప్రీ రీలీజ్ ఈవెంట్‌ను ర‌ద్దు చేసుకుంటున్నాం. అంద‌రూ అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తున్నాం.’ అని మేక‌ర్స్ తెలిపారు.

మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Pritish Nandy : ప్రముఖ కవి, రచయిత, నిర్మాత ప్రితీశ్‌ నంది క‌న్నుమూత‌

ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి.