Chiranjeevi : సంక్రాంతికి మెగాస్టార్‌తో ముగ్గురు హీరోలు..

ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Chiranjeevi : సంక్రాంతికి మెగాస్టార్‌తో ముగ్గురు హీరోలు..

Chiranjeevi Special interview with Sankranthiki release movies heros

Updated On : January 9, 2025 / 12:02 PM IST

Chiranjeevi : టాలీవుడ్‌లో ఒకప్పుడు బడా హీరోల సినిమాలు వస్తే అభిమానుల్లో పెద్ద రచ్చ జరిగేది. తమ అభిమాన హీరో సినిమా హిట్టు అవ్వుద్దని, తమ హీరో మూవీ రికార్డ్‌లను క్రియేట్ చేస్తుందని కొట్టుకున్నంత పనిచేసేవారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు పోటీ ఉన్నా ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ నేచర్ పెరిగిపోయింది. థియేటర్లలో పోటీకి సై అంటూనే బయట మాత్రం అందరు కలిసే ముందుకు సాగుతున్నారు. ఈ ఫ్రెండ్లీ మూమెంట్‌కి తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు.

ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 10న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటించిన గేమ్ ఛేంజర్, జనవరి 12న బాలయ్య హీరోగా వస్తున్న డాకు మహారాజ్, జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేశ్ థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూడు సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో సాగుతున్నాయి.

Ram Charan : హీరో కాకముందు చరణ్ మొదటిసారి స్టేజిపై మాట్లాడింది.. యాక్టర్ అవుతానని చిరంజీవికి చెప్పింది ఎప్పుడో తెలుసా?

అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలోకి రీసౌండ్ చేస్తోంది. సంక్రాంతికి వచ్చే ముగ్గురి హీరోలతో మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయనున్నారట. ఇప్పటికే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో వెంకటేశ్, రామ్‌చరణ్‌తో కలిసి సందడి చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురితో కలిసి చిరంజీవి ఇంటర్వ్యూ ఉంటుందనే అనే గాసిప్ వినిపిస్తోంది.

దీంతో సినీ ప్రేమికులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారట. మెగాస్టార్ ముగ్గురు హీరోలను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో , ముగ్గురు కలిసి ఎలాంటి అన్సర్ ఇస్తారో చూడాలని ఆడియన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇదే సంక్రాంతి బిగ్ ట్రీట్ అంటూ ముగ్గురి హీరోల ఫ్యాన్స్‌ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Pritish Nandy : ప్రముఖ కవి, రచయిత, నిర్మాత ప్రితీశ్‌ నంది క‌న్నుమూత‌