Ram Charan : హీరో కాకముందు చరణ్ మొదటిసారి స్టేజిపై మాట్లాడింది.. యాక్టర్ అవుతానని చిరంజీవికి చెప్పింది ఎప్పుడో తెలుసా?
హీరో కాకముందు చరణ్ మొదటిసారి స్టేజిపై మాట్లాడింది.. యాక్టర్ అవుతానని చిరంజీవికి చెప్పింది ఎప్పుడో తెలుసా?

Do You Know Ram Charan First Speech Before He Became Hero Details Here
Ram Charan : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చాడు. నేడు ఈ ఎపిసోడ్ ని రిలీజ్ చేసారు. ఈ షోలో చరణ్ బోలెడన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. బాలయ్య షోలో రామ్ చరణ్ మొదటిసారి స్టేజిపై మాట్లాడిన వీడియో చూపించాడు.
చరణ్ మొదటి సారి ఫ్యాన్స్ ముందు స్టేజిపై మాట్లాడింది ఎప్పుడో తెలుసా? 2004 లో ఫ్యాన్స్ నిర్వహించిన చిరంజీవి బర్త్ డే ఈవెంట్లో రామ్ చరణ్ ఫస్ట్ టైం మాట్లాడారు. ఈ ఈవెంట్లో చిరంజీవి.. ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు. మాటల్లో అరంగ్రేటం ఇవాళే చేస్తున్నాడు. మాట్లాడే అంత పెద్దవాడు కాలేదు కానీ ఏం మాట్లాడతాడో చూద్దాం. మనం వెనక లేకపోతే భయపడుతున్నాడు. వాడి వెనక మీరు ఉండాలి అని అన్నారు.
Also Read : Dil Raju : గేమ్ ఛేంజర్ సినిమా కోసం చరణ్ ఇంకో సినిమా వదులుకున్నాడు.. సంవత్సరం లేట్ అయింది..
అనంతరం చరణ్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి తరపున మా డాడీకి హ్యాపీ బర్త్ డే చెప్పుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. దీని గురించి షోలో మాట్లాడుతూ.. అప్పుడు నాకు చెమటలు పట్టేసాయి. నాకు స్టేజి ఫియర్ మొదలైంది అప్పుడే అని అన్నారు.
ఇక యాక్టర్ గా మారుదామని ఎప్పుడు అనుకున్నావు అని బాలయ్య అడగ్గా.. చిన్నప్పుడు సినిమాలు, సినిమా మ్యాగజైన్లు, అవార్డులకు మమ్మల్ని దూరంగా ఉంచేవాళ్ళు డాడీ. సినిమా విషయాలు మాట్లాడాలంటే భయపడేవాళ్లు. కానీ చిన్నప్పట్నుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో నాకు యాక్టర్ అవ్వాలని ఉండేది. కానీ నేను యాక్టర్ అవుతాను అని చెప్పే ధైర్యం లేదు. నాకు వస్తున్న తక్కువ మార్కులు చూసి డాడీనే ఒకసారి అడిగారు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ఒకసారి చెప్పు అంటే అప్పుడు భయం భయంగానే యాక్టర్ అవుతాను అని చెప్పాను.
Also Read : Game Changer : తెలంగాణలో కూడా గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు పెంపు.. ఎన్ని రోజులు? ఎంత పెంచారంటే?
డాడీ.. సరే కానీ మొత్తం నీ మీదే ఆధారపడి ఉంటుంది అని అన్నారు. నాకు యాక్టర్ అవ్వకపోతే ఇంకో ప్లాన్ లేదు. ఇక్కడే డూ ఆర్ డై అనుకున్నాను అని చెప్పారు. ఆ తర్వాత ఇంటికి ఎవరు వచ్చినా నాన్న పేరు నిలబెట్టాలి అని అనేవాళ్ళు. ఆ ప్రెజర్ బాగా ఉండేది అని తెలిపారు.
❤️💎 @AlwaysRamCharan #UnstoppableWithNBK #RamCharan#GameChanger pic.twitter.com/qnWsDX0G1Y
— FlagFanatic🇮🇳 (@ShruthiTungala) January 8, 2025