Dil Raju : గేమ్ ఛేంజర్ సినిమా కోసం చరణ్ ఇంకో సినిమా వదులుకున్నాడు.. సంవత్సరం లేట్ అయింది..

అన్‌స్టాపబుల్ షోలో దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ..

Dil Raju : గేమ్ ఛేంజర్ సినిమా కోసం చరణ్ ఇంకో సినిమా వదులుకున్నాడు.. సంవత్సరం లేట్ అయింది..

Dil Raju Comments on Game Changer and Ram Charan in Balakrishna Unstoppable

Updated On : January 8, 2025 / 10:27 PM IST

Dil Raju : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టికెట్ హైక్స్ కూడా ఇచ్చారు. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చరణ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చాడు. ఇదే షోకి గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు కూడా వచ్చారు.

Also Read : Game Changer : తెలంగాణలో కూడా గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు పెంపు.. ఎన్ని రోజులు? ఎంత పెంచారంటే?

అన్‌స్టాపబుల్ షోలో దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను స్క్రిప్ట్ అప్పుడే బడ్జెట్స్ అన్ని చూసుకుంటాను. కానీ శంకర్ గారి సినిమా కాబట్టి బడ్జెట్స్ పెరిగాయి. 2021లో ఈ సినిమా మొదలయింది. రెండేళ్లలో అనుకున్నాము. 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నాము. ఇప్పుడు 2025 సంక్రాంతికి వస్తుంది. సంవత్సరం లేట్ అయింది. ఇది బిగ్ జర్నీ. గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఆల్మోస్ట్ ఓకే అయిన ఒక సినిమాని వదులుకున్నాడు చరణ్. అంత కమిటెడ్ గా ఉన్నాడు ఈ సినిమా కోసం. చిరంజీవి గారికి ఆల్రెడీ సినిమా చూపించాను అని తెలిపారు.

ఇక చరణ్ సినిమా గురించి మాట్లాడుతూ.. పవర్ ఫుల్ IAS ఆఫీసర్ గురించి ఈ సినిమా. ఒక IAS సిగ్నేచర్ కూడా పవర్ ఫుల్. అసలు స్టేట్ ని వాళ్ళు కదా రూల్ చేసేది. వాళ్ళ గురించి ఒక సినిమా తీయడం గర్వంగా ఉంది అని అన్నారు.

Also Read : Ram Charan : నాగబాబు బాబాయ్ వల్ల డాడీ బెల్ట్ తీసి మరీ కొట్టారు.. చిరంజీవి చరణ్ ని ఏ విషయంలో కొట్టారో తెలుసా?