Ram Charan : నాగబాబు బాబాయ్ వల్ల డాడీ బెల్ట్ తీసి మరీ కొట్టారు.. చిరంజీవి చరణ్ ని ఏ విషయంలో కొట్టారో తెలుసా?
మీ డాడీ నిన్ను ఎప్పుడైనా కొట్టాడా అని చరణ్ ని బాలయ్య అడిగారు.

Ram Charan Reveals about Chiranjeevi Beating him in Balakrishna Unstoppable Show
Ram Charan : తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసారు. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోలో చరణ్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో మీ డాడీ నిన్ను ఎప్పుడైనా కొట్టాడా అని బాలయ్య అడిగారు.
Also See : అల్లు అర్జున్ పుష్ప 2 మేకింగ్ వీడియో రిలీజ్.. బన్నీ, సుకుమార్ ఎంత కష్టపడ్డారో చూశారా?
దీనికి చరణ్ సమాధానమిస్తూ.. నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు అనుకుంట ఒకే ఒకసారి డాడీ కొట్టారు నాగబాబు బాబాయ్ వల్ల. ఒకరోజు నేను బయట కూర్చున్నాను. బయట ఇద్దరు కొట్టుకుంటున్నారు. వాళ్ళు వేరే భాషలో బూతులు మాట్లాడుకుంటూ కొట్టుకున్నారు. నాకు ఆ భాష అర్ధం కాలేదు, అవి భూతులు అని తెలీదు. ఇంట్లోకొచ్చి వాళ్ళు మాట్లాడుకున్న వర్డ్స్ నాగబాబు బాబాయ్ తో అన్నా. దాంతో బాబాయ్ నన్ను డాడీ దగ్గరకు తీసుకెళ్లి డాడీ పడుకుంటే లేపి మరీ ఈ పదాలు మాట్లాడుతున్నాడు అని చెప్పారు. ఎందుకు మాట్లాడాడు, ఎక్కడ నేర్చుకున్నాడు అని అడక్కుండానే బీరువాలో మా తాతయ్య పోలీస్ బెల్ట్ ఉంటే తీసి కొట్టారు డాడీ. తర్వాత వాడికి అసలు వాటి అర్ధం కూడా తెలీదు కదా అని మళ్ళీ వాళ్ళే అన్నారు అని తెలిపాడు.
అదొక్కసారే డాడీ కొట్టారు. తర్వాత మళ్ళీ ఎప్పుడూ కొట్టలేదు. నాగబాబు బాబాయ్ వల్లే కొట్టారు అని చెప్పారు చరణ్. ఇక రామ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతుండగా, బాలకృష్ణ డాకు మహారాజ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది.
Also Read : Ram Charan – Samantha : సమంత మంచి అమ్మాయి.. నాకు మంచి ఫ్రెండ్.. బాలయ్య షోలో చరణ్ కామెంట్స్..