Ram Charan – Samantha : సమంత మంచి అమ్మాయి.. నాకు మంచి ఫ్రెండ్.. బాలయ్య షోలో చరణ్ కామెంట్స్..

ఈ షోలో చరణ్ సమంత గురించి మాట్లాడాడు. 

Ram Charan – Samantha : సమంత మంచి అమ్మాయి.. నాకు మంచి ఫ్రెండ్.. బాలయ్య షోలో చరణ్ కామెంట్స్..

Ram Charan Comments on Samantha in Balakrishna Aha Unstoppable Show

Updated On : January 8, 2025 / 9:09 PM IST

Ram Charan – Samantha : రామ్ చరణ్, సమంత కలిసి సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో చరణ్ నటన చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాతో సమంత – చరణ్ మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. తాజాగా రామ్ చరణ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోలో చరణ్ సమంత గురించి మాట్లాడాడు.

Also Read : Ram Charan Daughter : నేను ఆ భారం అనుభవించాను.. అందుకే చూపించట్లేదు.. బాలయ్య షోలో కూతురు గురించి చెప్తూ చరణ్ ఎమోషనల్..

ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ సమంత, అలియా భట్, కియారా వీళ్ళ ముగ్గురిలో బెస్ట్ యాక్టర్ ఎవరు అని సరదాగా అడిగారు బాలయ్య. చరణ్ సమంత పేరు చెప్పి.. సమంత బెస్ట్ యాక్టర్. సమంత నాకు మంచి ఫ్రెండ్. తను మంచి అమ్మాయి. మా ఫ్యామిలీకి కూడా చాలా దగ్గర. ఫెంటాస్టిక్ యాక్టర్ అని తెలిపాడు. దీంతో చరణ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. వీరిద్దరి మధ్య ఇంత మంచి స్నేహం ఉందా అని అనుకుంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

చరణ్ జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. ఇక సమంత మాత్రం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇటీవలే గతంలో తాను చేసిన సిటాడెల్ సిరీస్ రిలీజయింది. ప్రస్తుతం తన హెల్త్, బిజినెస్ లు చూసుకుంటుంది. సమంతకు నాగ చైతన్యతో విడాకులు అయిన సంగతి తెలిసిందే.

Ram Charan Comments on Samantha in Balakrishna Aha Unstoppable Show

Also Read : Ram Charan : నానమ్మ అంటే చరణ్ కి ఎంత ఇష్టమో.. చరణ్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?