Ram Charan Daughter : నేను ఆ భారం అనుభవించాను.. అందుకే చూపించట్లేదు.. బాలయ్య షోలో కూతురు గురించి చెప్తూ చరణ్ ఎమోషనల్..
తన కూతురు క్లిన్ కారా గురించి కూడా మాట్లాడారు చరణ్.

Ram Charan Spoke about Her Daughter Klin Kaara in Balakrishna Unstoppable Show
Ram Charan Daughter : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసాడు చరణ్. చరణ్ వచ్చిన ఎపిసోడ్ ఆహా ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు క్లిన్ కారా గురించి కూడా మాట్లాడారు.
Also Read : Ram Charan : నానమ్మ అంటే చరణ్ కి ఎంత ఇష్టమో.. చరణ్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?
చరణ్ – ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఫేస్ చూపించకపోయినా క్లిన్ కారా పేరుతో, ఫేస్ కనపడకుండా బయటకు వచ్చిన ఫొటోలతోనే పాప మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ వైరల్ అయిపోతుంది. అయితే ఫ్యాన్స్ ఫేస్ చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. బాలయ్య ఎపిసోడ్ లో కూతురు పుట్టినప్పుడు ఫ్యామిలీ అంతా హాస్పిటల్ కి వెళ్లినప్పటి వీడియో ప్లే చేసి కూతురు గురించి, తనని ఎప్పుడు చూపిస్తావు అని బాలయ్య అడిగారు.
దీనికి చరణ్ సమాధానమిస్తూ.. నిజంగానే నేను ఆడపిల్లని కోరుకున్నాను. RRR సినిమా మూడేళ్లు చేస్తూ ఉండటం వల్ల చాలా టైం దొరికింది. దాంతో పాపకు ఎక్కువ సమయం ఇస్తున్నాను. మొదటి రెండు మూడేళ్లు చాలా బాగుంటుంది వాళ్ళతో. పొద్దున్నే వచ్చి నిద్ర లేపేస్తుంది. షూటింగ్ ఉన్నా లేకపోయినా రోజూ పొద్దున్నే తనతో గడిపిన తర్వాతే ఏదైనా మొదలుపెడతాను. తన ఏజ్ ప్రస్తుతం ఒకటిన్నర సంవత్సరం. బక్కగా ఉంటుంది. అది తినేదానికి తిరిగే తిరుగుడుకు సంబంధం ఉండదు. ఒక ముద్ద తింటే కిలోమీటర్ పరిగెడుతుంది. అందరూ అడుగుతారు క్లిన్ కారాని ఎప్పుడు చూపిస్తావు అని. కానీ ప్రైవసీ అనేది ముఖ్యం. ఆర్టిస్ట్ గా మనకు ఎలాగో ప్రైవసీ లేదు. కానీ వాళ్లకు ఇప్పుడైనా ప్రైవసీ అనే గిఫ్ట్ ఇస్తున్నాను. స్కూల్ లో చిన్నప్పుడు మమల్ని కూడా హీరో పిల్లలు అని బాగా రికగ్నైజ్ చేయడం వల్ల ఫ్రీగా బతికేవాళ్ళం కాదు. అదంతా నాకు భారంగా ఉండేది. అందుకే వాళ్లకు ప్రైవసీ ఇస్తాను. ఇప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తుంది. నాన్న అని పిలిచినప్పుడు ఫేస్ రివీల్ చేస్తాను అని తెలిపారు.
Also Read : Ram Charan : బాలయ్య గారి పిల్లలతో డిన్నర్.. బాలయ్య మా ఇంటికి వచ్చి.. చరణ్ ఆసక్తికర ఫ్లాష్ బ్యాక్..
దీంతో మెగా ఫ్యాన్స్ క్లిన్ కారా నాన్న అని ఎప్పుడు పిలుస్తుందో, క్లిన్ కారా ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.