Ram Charan : బాలయ్య గారి పిల్లలతో డిన్నర్.. బాలయ్య మా ఇంటికి వచ్చి.. చరణ్ ఆసక్తికర ఫ్లాష్ బ్యాక్..

తాజాగా సంక్రాంతి సందర్భంగా కొత్త ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేసారు. ఈ ఎపిసోడ్ కి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు.

Ram Charan : బాలయ్య గారి పిల్లలతో డిన్నర్.. బాలయ్య మా ఇంటికి వచ్చి.. చరణ్ ఆసక్తికర ఫ్లాష్ బ్యాక్..

Ram Charan Reveals Interesting Flash Back in Balakrishna Unstoppable Show

Updated On : January 8, 2025 / 8:14 PM IST

Ram Charan : బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షోతో దూసుకుపోతున్నారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా కొత్త ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేసారు. ఈ ఎపిసోడ్ కి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. నందమూరి హీరోతో మెగా హీరో కాంబోలో ఇంటర్వ్యూ రావడంతో ఈ ఇంటర్వ్యూ దూసుకుపోతుంది. అన్‌స్టాపబుల్ షోలో రామ చరణ్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Also Read : Pushpa 2 Reloaded Version : పుష్ప 2 మళ్ళీ వాయిదా.. సంక్రాంతి సినిమాల కోసం తగ్గిన అల్లు అర్జున్..

ఈ క్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. 1992లో అందరి తర్వాత చివరగా మేము చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్ కి వచ్చిన తర్వాత నాన్న షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. ఓ రోజు బాలయ్య గారు మా ఇంటికి సాయంత్రం పూట తన ఇద్దరు పిల్లలతో వచ్చి చిరంజీవి మీ అబ్బాయిని బయటకు పంపు ఇప్పుడే వచ్చాడు కదా హైదరాబాద్ కి మా పిల్లలతో డిన్నర్ కి బయటకు తీసుకెళ్తాను అని అన్నారు. నాగార్జున సర్కిల్ లో ఓ రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకెళ్లారు. అది బ్యూటిఫుల్ మెమరీ. ఇప్పటికి అది గుర్తు ఉంది నాకు అని తెలిపారు. దీంతో బాలయ్య మంచి మనసుని అభినందిస్తున్నారు.

ఇక రామ చరణ్ గేమ్ చెంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతుండగా, బాలకృష్ణ డాకు మహారాజ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది.

Also Read : Racharikam Trailer : ఆర్జీవీ భామ అప్సరా రాణి ‘రాచరికం’ ట్రైలర్ రిలీజ్.. అరాచకంగా ఉందిగా..