Racharikam Trailer : ఆర్జీవీ భామ అప్సరా రాణి ‘రాచరికం’ ట్రైలర్ రిలీజ్.. అరాచకంగా ఉందిగా..
రాచరికం మూవీ ట్రైలర్‌ను రాజాసాబ్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు.

Varun Sandesh Apsara Rani Racharikam Movie Trailer Released
Racharikam Trailer : అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘రాచరికం’. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈశ్వర్ నిర్మాతగా సురేశ్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా రాచరికం ట్రైలర్ రిలీజ్ చేసారు.
Also Read : Balakrishna : తమ్ముడు పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వెళ్ళా.. అక్కడ అతన్ని చూసి.. బాలకృష్ణ కామెంట్స్..
రాచరికం మూవీ ట్రైలర్‌ను రాజాసాబ్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే రాచకొండ అనే ఊళ్ళో జరిగే రాజకీయ కథ అని తెలుస్తుంది. రాజకీయంతో పాటు, ప్రేమ కథ కూడా ఉంది. ట్రైలర్ లోనే అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లుక్స్, యాక్టింగ్ అదరగొట్టేసారు. ‘రాచకొండ ఒక అడవి లాంటిదబ్బా.. ఈడ బలంతో పోరాడే పులులు, బలగంతో పోరాడే ఏనుగులు, ఎత్తుకు పై ఎత్తు వేసే గుంట నక్కలు, కాసుకుని కాటేసే విష సర్పాలు ఉంటాయి. వాటి మధ్య జరిగే పోరులో రక్త పాతాలే తప్ప రక్త సంబంధాలు ఉండవు’ అంటూ ఈ ట్రైలర్ సాగింది.
మీరు కూడా రాచరికం ట్రైలర్ చూసేయండి..
విలేజ్ పొలిటికల్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న రాచరికం సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ వేంగి అదిరిపోయే BGM ఇస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. ఈ సినిమాలో అప్సర రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also See : Rana Wife Miheeka : రానా భార్య మిహీక కొత్త బిజినెస్.. ఓపెన్ చేసిన రాజమౌళి.. ఫోటోలు చూశారా?
ఇక అప్సర రాణి 4 లెటర్స్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఆర్జీవీ డేంజరస్ సినిమాతో బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత పలు సినిమాలలో ఐటెం సాంగ్స్ తో కవ్వించింది. ఇప్పుడు రాచరికం సినిమాలో అదిరిపోయే నటనతో రాబోతున్నట్టు తెలుస్తుంది.