Balakrishna : తమ్ముడు పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వెళ్ళా.. అక్కడ అతన్ని చూసి.. బాలకృష్ణ కామెంట్స్..

తాజాగా బాలయ్య, శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్ కలిసి ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా సినిమాపై పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడారు.

Balakrishna : తమ్ముడు పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వెళ్ళా.. అక్కడ అతన్ని చూసి.. బాలకృష్ణ కామెంట్స్..

Balakrishna says after saw Bobby Deol in Harihara Veeramallu he cast to Daaku Maharaaj

Updated On : January 8, 2025 / 6:10 PM IST

Balakrishna : బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన దాకు మహారాజ్ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ రిలీజ్ చేసి మంచి అంచనాలు పెంచారు. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా బాలయ్య, శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్ కలిసి ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా సినిమాపై పలు ఆసక్తికర అంశాల గురించి మాట్లాడారు.

Also See : Rana Wife Miheeka : రానా భార్య మిహీక కొత్త బిజినెస్.. ఓపెన్ చేసిన రాజమౌళి.. ఫోటోలు చూశారా?

ఈ ఇంటర్వ్యూలో సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించాడు కదా, ఆయన్ని ఎలా తీసుకున్నారు అని ఆయన ప్రస్తావన రాగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సన్నీ డియోల్, బాబీ డియోల్ ని అంతకుముందు కొన్ని సార్లు కలిసాము. నేను వీరసింహారెడ్డి షూటింగ్ చేసేటపుడు పక్క సెట్ లో తమ్ముడు పవన్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతుంది. అప్పుడు క్రిష్ డైరెక్టర్. ఆ సెట్లోకి సరదాగా వెళ్ళాను. ఆ సెట్ లో బాబీ డియోల్ ని చూసాను. తర్వాత నా దగ్గరికి డైరెక్టర్ వాళ్ళు విలన్ గా ఎవరిని తీసుకోవాలి అని కొన్ని పేర్లు చెప్పారు. నేను రెండు నిముషాలు ఆలోచించి బాబీ డియోల్ ని తీసుకోండి అని చెప్పాను. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పటికి యానిమల్ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు అని తెలిపారు.

బాలయ్య బాబీ డియోల్ చూసింది పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ లో. ఆ సినిమాలో కూడా బాబీ డియోల్ విలన్. మొదట ఆ సినిమాకి క్రిష్ డైరెక్టర్ అయినా పలు కారణాలతో తప్పుకోవడంతో ప్రస్తుతం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ హరిహర వీరమల్లు సెట్స్ లో బాబీ డియోల్ ని చూసి బాలయ్య ఆయన్ని తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలిపారు.

Also See : ఆన్లైన్ స్కామ్స్ పై విజయ్ దేవరకొండ వీడియో.. అలాంటి మెసేజ్ లు చూసి మోసపోకండి..

ఒకప్పుడు స్టార్ హీరోగా కెరీర్ చూసిన బాబీ డియోల్ ఆ తర్వాత సినిమాలు లేక ఖాళీ అయ్యారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కెరీర్ మొదలుపెట్టారు. యానిమల్ సినిమాతో బాబీ డియోల్ కెరీర్ మళ్ళీ పీక్స్ కి వెళ్ళింది. అయితే ఇటీవల డైరెక్టర్ బాబీ కూడా ఓ ఇంటర్వ్యూలో బాబీ డియోల్ ని యానిమల్ సినిమా కంటే ముందే మేము తీసుకున్నాము అని తెలిపారు. కాకపోతే డాకు మహారాజ్, హరిహర వీరమల్లు సినిమాలు లేట్ అయ్యాయి. యానిమల్ ముందొచ్చి బాబీ డియోల్ మార్కెట్ పెరిగింది.

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించారు.