Actor Navdeep Comments again on Marriage Video Goes Viral
Navdeep : టాలీవుడ్(Tollywood) లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) ప్రభాస్ తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఆ లిస్ట్ లో నవదీప్ ఫస్ట్ ఉంటాడు. జై సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ ఆ తర్వాత హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశాడు. 2021లో మోసగాళ్లు సినిమాలో ఓ క్యారెక్టర్ తో పలకరించిన నవదీప్ ఆ తర్వాత ఇప్పటివరకు థియేటర్స్ లో కనపడలేదు. అప్పుడప్పుడు పలు సిరీస్ లు కూడా చేస్తున్నాడు.
అయితే నవదీప్ కి ముందు నుంచి కూడా పెళ్లి(Marriage) మీద సదభిప్రాయం లేదు. పెళ్లి చేసుకోను అనే కచ్చితంగా చెప్పేస్తాడు. వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి చేసుకోను అని క్లారిటీ ఇచ్చేశాడు నవదీప్. అయినా నవదీప్ వాళ్ళ అమ్మ అతన్ని పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉంటుంది. దీనిపై తాజాగా నవదీప్ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు.
నవదీప్ ఈ వీడియోలో.. ఇవాళ పొద్దున్నే మా మదర్ ఇండియా నన్ను పెళ్లి గురించి ఓ ప్రశ్న అడిగింది. నిజంగా పెళ్లిళ్లు అంత బ్యాడ్ అయితే, పెళ్లి వర్కౌట్ అవ్వక విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని అడిగింది. నా దగ్గర సమాధానం లేదు అని చెప్పాడు. నవదీప్ వీడియో వైరల్ గా మారింది. అలాగే ఈ వీడియోలో జరగాలి పెళ్లి అని కూడా ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టాడు. దీంతో పెళ్లి గురించి ఇలా ఆలోచించి నవదీప్ కూడా పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి.
Also Read : Sreemukhi : ఒకప్పుడు ఒకే గదిలో బతికేవాళ్ళం.. ఇవాళ ఇంత పెద్దింట్లో దీపావళి.. శ్రీముఖి స్పెషల్ వీడియో
ఇక నవదీప్ వాళ్ళ అమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానంగా పలువురు నెటిజన్లు రకరకాల సమాధానాలు చెప్తున్నారు. మీకు కూడా ఆ ప్రశ్నకి సమాధానం తెలిస్తే నవదీప్ వీడియో కింద కామెంట్ చేసేయండి.