Sreemukhi : ఒకప్పుడు ఒకే గదిలో బతికేవాళ్ళం.. ఇవాళ ఇంత పెద్దింట్లో దీపావళి.. శ్రీముఖి స్పెషల్ వీడియో

తాజాగా శ్రీముఖి యూట్యూబ్ లో ఓ వీడియో అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో తన దీపావళి(Diwali) సెలెబ్రేషన్స్ ని చూపించింది. అయితే శ్రీముఖి దీపావళి సందర్భంగా తమ పేరెంట్స్ కి కాస్ట్ లీ గిఫ్ట్స్ ఇచ్చింది.

Sreemukhi : ఒకప్పుడు ఒకే గదిలో బతికేవాళ్ళం.. ఇవాళ ఇంత పెద్దింట్లో దీపావళి.. శ్రీముఖి స్పెషల్ వీడియో

Sreemukhi Shares Diwali Celebrations Video with Family

Sreemukhi : శ్రీముఖి తెలుగు టీవీ షోలతో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. యాంకర్ గా పలు షోలు, ఈవెంట్స్ తో మెప్పిస్తునే అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం రెండు ఛానల్స్ లో పలు షోలు, స్పెషల్ ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది శ్రీముఖి. యూట్యూబ్ లో కూడా తనకు సంబంధిచిన వీడియోలను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ సందడి చేస్తుంది.

తాజాగా శ్రీముఖి యూట్యూబ్ లో ఓ వీడియో అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో తన దీపావళి(Diwali) సెలెబ్రేషన్స్ ని చూపించింది. అయితే శ్రీముఖి దీపావళి సందర్భంగా తమ పేరెంట్స్ కి కాస్ట్ లీ గిఫ్ట్స్ ఇచ్చింది. తండ్రికి బంగారు చైన్ గిఫ్ట్ గా ఇవ్వగా, తల్లికి డైమండ్ నెక్లస్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ గిఫ్ట్స్ ని చూసి శ్రీముఖి తల్లితండ్రులిద్దరూ ఆశ్చర్యపోయి సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : Payal Rajput : మళ్ళీ డిలీట్ చేసేస్తాను అంటూ ఒక స్పెషల్ వీడియో షేర్ చేసిన పాయల్..

శ్రీముఖి ఈ గిఫ్ట్స్ తన తల్లితండ్రులకు ఇస్తూ.. ఒకప్పుడు మాది చాలా మధ్య తరగతి కుటుంబం. ఒకే గదిలో బతికేవాళ్ళం. ఆ స్థాయి నుంచి కష్టపడి ఒక్కో మెట్టు ఎదిగి ఇవాళ ఇంత పెద్ద ఇంట్లో దీపావళి చేసుకుంటున్నాం అంటే అందుకు కారణం మా పేరెంట్స్. మాకు ఇంత మంచి జీవితం ఇచ్చిన వీరికి ఈ చిన్న గిఫ్ట్స్ ఇస్తున్నాం అని చెప్పి, అలాగే తల్లితండ్రుల కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు శ్రీముఖి, ఆమె తమ్ముడు శుశ్రుత్. అలాగే తన ఇంట్లో పనిచేసే వారికి, సిబ్బందికి స్వీట్ బాక్స్ లు పంచింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.