Payal Rajput : మళ్ళీ డిలీట్ చేసేస్తాను అంటూ ఒక స్పెషల్ వీడియో షేర్ చేసిన పాయల్..

పాయల్ రాజ్‌పుత్ ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇలాంటి వీడియోలు తాను ఎప్పుడు పోస్ట్ చేయలేదని, ఈ వీడియోని కూడా డిలీట్ చేసేస్తాను అంటూ ఆమె పేర్కొన్నారు.

Payal Rajput : మళ్ళీ డిలీట్ చేసేస్తాను అంటూ ఒక స్పెషల్ వీడియో షేర్ చేసిన పాయల్..

Mangalavaaram Movie heroine Payal Rajput shares a special video

Updated On : November 17, 2023 / 1:45 PM IST

Payal Rajput : RX100 సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన పాయల్ రాజ్‌పుత్.. ఆ చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తరువాత పలు భాషల్లో అవకాశాలు అందుకుంటూ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా పాయల్ ‘మంగళవారం’ అనే తెలుగు సినిమాలో నటించారు. ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది. నిన్న రాత్రే కొన్ని చోట్ల ఈ మూవీ ప్రీమియర్స్ రన్ అయ్యాయి. ప్రీమియర్ షోలో సినిమాకి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఆల్రెడీ మూవీ పై బజ్ ఉండడం, ప్రీమియర్స్ కి పాజిటివ్ టాక్ రావడంతో మార్నింగ్ షోకి ఆడియన్స్ క్యూ కట్టారు.

మొదటి షో చూసిన ఆడియన్స్ నుంచి కూడా మూవీకి సూపర్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా పాయల్ పాత్రకి మంచి స్పందన వస్తుంది. ఇక మూవీ వస్తున్న స్పందన చూసిన పాయల్ ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇలాంటి వీడియోలు తాను ఎప్పుడు పోస్ట్ చేయలేదని, ఈ వీడియోని కూడా డిలీట్ చేసేస్తాను అంటూ ఆమె పేర్కొన్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా..?

Also read : Anil Ravipudi : రాజకీయ నాయకుడిగా మరోబోతున్న డైరెక్టర్.. అనిల్ రావిపూడి కొత్త అవతారం..

ఆ వీడియోలో పాయల్ రాజ్‌పుత్ ఎమోషనల్ అవుతూ కనిపించారు. ఆడియన్స్ తో కలిసి ప్రీమియర్స్ చూసిన ఆమె ప్రేక్షకుల స్పందన చూసి ఎమోషనల్ అయ్యారు. సినిమాని ఆదరించినందుకు థాంక్యూ తెలియజేశారు. ఈ సినిమాలో పాయల్ సెక్సువల్ డిజాడర్ తో బాధ పడే పాత్రలో పాయల్ నటించారు. ఈ పాత్ర కోసం తాను చేసిన యాక్టింగ్ తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ ఆమె పేర్కొన్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఊరిలో అక్రమ సంబంధాలు కలిగి ఉన్న వారంతా ప్రతి మంగళవారం చనిపోతుంటారు. ఆ అక్రమ సంబంధాల గురించి గోడల మీద రాసి వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఆ హత్యలు చేసేది ఎవరు..? అసలు గోడ మీద ఎందుకు రాసి చంపుతున్నారు..? అనేది తెరపై చూడాల్సిందే.