Actor Naveen Chandra emotional comments about Ravi Teja's at mass Jathara event
Naveen Chandra: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ, లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల కాంబోలో వస్తున్న సినిమా “మాస్ జాతర”. రచయిత భాను భోగవరపు దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. (Naveen Chandra)పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన మాస్ జాతర ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రాగా సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందిలో భాగంగానే తాజాగా మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
Suriya: రజినీకాంత్ తరువాత రవితేజనే.. ఆ ఒక్క సినిమాతో మా తమ్ముడి జీవితం మారిపోయింది..
ఈ ఈవెంట్ లో నటుడు నవీన్ చంద్ర మాట్లాడుతూ హీరో రవి తేజ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. “నేను ఈ సినిమాలో శివుడు అనే పాత్ర చేశాడు. ఆ పాత్ర అంత బాగా రావడానికి కారణం మా దర్శకుడు భాను. నేను కూడా రవి తేజ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి సినిమాలోకి వచ్చాను. అస్సలు అనుకోలేదు.. ఆయనతో ఇలా సినిమా చేసే అవకాశం వస్తుంది అని. ఇది నాకు ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనే చెప్పాలి. లక్ష్మణ్ బైరి వర్సెస్ శివుడు సీన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. మా అమ్మకు చెప్తున్నా.. అమ్మా బ్రతికితే రవి తేజలా బ్రతకాలి.
ఇండస్ట్రీలో నాపై అందరికి ఒక సింపతీ ఉండేది. కానీ, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా ఓవర్కం చేయాలి అనే విషయాలు మీ నుంచే నేర్చుకున్నాను. ఆ విషయంలో మీకు హ్యాట్సాఫ్. ఇది పొగడ్త కాదు. నాకు ఇప్పటివరకు ఆయన గురించి చెప్పే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది చెప్తున్నా. ఈ అక్టోబర్ 31 మాములుగా ఉండదు. మాస్ జాతర అదిరిపోతుంది. మీరు డిజప్పాయింట్ అవ్వరు”అంటూ చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.