Suriya: రజినీకాంత్ తరువాత రవితేజనే.. ఆ ఒక్క సినిమాతో మా తమ్ముడి జీవితం మారిపోయింది..
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "మాస్ జాతర". కొత్త దర్శకుడు(Suriya) భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డాన్సింగ్ డాల్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.
Tamil star Suriya heaps praise on Ravi Teja at the Mass Jatara event
Suriya: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “మాస్ జాతర”. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డాన్సింగ్ డాల్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా (Suriya)అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా తాజాగా మాస్ జాతర “ప్రీ రిలీజ్” ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కి తమిళ స్టార్ హీరో సూర్య చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
Kantara: Chapter 1 OTT: ఓటీటీకి వచ్చేస్తున్న కాంతార: చాఫ్టర్ 1.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఈ సంధర్బంగా సూర్య మాట్లాడుతూ రవి తేజపై ప్రశంసలు కురిపించాడు.. “20 ఏళ్ల కిందట మొదటిసారి రవి తేజను కలిశాను. అతనితో నాకు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంది. మా ఇంట్లో కూడా ఆయన గురించి మాట్లాడుకునే వారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాడు రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇప్పుడు మాస్ మహారాజ దాకా ఆయన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తి. ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. తమిళ్ లోనూ ఆయన సినిమాలను ఎంజాయ్ చేస్తుంటాం.
అన్ని లాంగ్వేజెస్ వారికి నచ్చేలా సినిమాలు చేయడం కొందరికే సాధ్యం అవుతుంది. అలా చేసినవారిలో అప్పుడు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఇప్పుడు రవితేజ మాత్రమే. రవితేజ సినిమాల్లో విక్రమార్కుడు నా ఫేవరెట్. ఆ సినిమాను తమిళ రీమేక్ తమ్ముడు కార్తీ జీవితాన్నే మార్చేసింది. అదే రేంజ్ లో ఈ మాస్ జాతర కూడా పెద్ద హిట్ అవుతుంది. అక్టోబర్ 31న థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూడండి” అంటూ చెప్పుకొచ్చాడు సూర్య. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
