Market Mahalakshmi : సాఫ్ట్‌వేర్ అబ్బాయి కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ప్రేమిస్తే?.. ‘మార్కెట్ మహాలక్ష్మి’ మోషన్ పోస్టర్ రిలీజ్..

'కేరింత' ఫేమ్ నూకరాజు అలియాస్ పార్వతీశం.. సాఫ్ట్‌వేర్ అబ్బాయిగా కొత్త సినిమా తీసుకు రాబోతున్నారు. మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయితో ప్రేమాయణం..

actor parvateesam new movie Market Mahalakshmi motion poster released

Market Mahalakshmi : ‘కేరింత’ మూవీలో తన కామెడీతో అందర్నీ నవ్వించిన నూకరాజు అలియాస్ పార్వతీశం.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా కూడా పలు సినిమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు హీరోగా తన కొత్త సినిమాని తీసుకు రాబోతున్నారు. ‘మార్కెట్ మహాలక్ష్మి’ అనే ఓ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తున్నారు. వియస్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రణీకాన్వికా హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇటీవలే ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇక ఈ పోస్టర్ ని టాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ బివిఎస్ రవి చేతుల మీదుగా విడుదల చేశారు. పార్వతీశం అండ్ మూవీ టీంకి బివిఎస్ రవి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. కాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తో సినిమా స్టోరీ లైన్ కూడా రివీల్ చేశారు. భారీ కట్నం కోసం సాఫ్ట్‌వెర్ కొడుకు తండ్రి ఎదురు చూస్తుంటే.. కొడుకు ఏమో కూరగాయలు అమ్మే అమ్మాయితో ప్రేమలో పడతాడు.

Also read : Cameraman Gangatho Rambabu : రీ-రిలీజ్‌కి కెమెరామెన్ గంగతో రాంబాబు.. ఎప్పుడో తెలుసా..!

ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. మరి నూకరాజుగా అందరికి గుర్తుండి పోయిన పార్వతీశం.. ఈ సినిమాలో సాఫ్ట్‌వెర్ ఉద్యోగిగా ఎలా అలరిస్తాడో చూడాలి. కాగా ఈ సినిమాలో అమృతం హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అఖిలేష్ కలారు బి2పి స్టూడియోస్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిష్టర్ జో సంగీతం అందిస్తుంటే సృజన శశాంక బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు.