Cameraman Gangatho Rambabu : రీ-రిలీజ్‌కి కెమెరామెన్ గంగతో రాంబాబు.. ఎప్పుడో తెలుసా..!

రీ-రిలీజ్‌కి రెడీ అయిన పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు. ఎప్పుడో తెలుసా..?

Cameraman Gangatho Rambabu : రీ-రిలీజ్‌కి కెమెరామెన్ గంగతో రాంబాబు.. ఎప్పుడో తెలుసా..!

Pawan Kalyan Cameraman Gangatho Rambabu re release details

Updated On : January 31, 2024 / 5:00 PM IST

Cameraman Gangatho Rambabu : టాలీవుడ్ లో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక పక్క థియేటర్స్ లో వరుసపెట్టి కొత్త సినిమాలు సందడి చేస్తున్నా.. కొందరు ఆడియన్స్ కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేయాలంటూ డిమాండ్స్ వస్తుండడంతో.. మేకర్స్ ఆయా చిత్రాలను రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రెడీ అవుతుంది.

పవన్, తమన్నా హీరోహీరోయిన్స్ తెరకెక్కిన ఈ చిత్రం 2012లో రిలీజ్ అయ్యింది. పూరీజగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ ఒక జర్నలిస్ట్ గా నటించిన ఈ సినిమాలో.. తప్పులు చేసే ప్రభుత్వాన్ని నిలదీసే ఒక సామాన్య పౌరుడిగా హీరో పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. పూరీ డైలాగ్స్‌కి పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ నుంచి విజుల్స్ అండ్ క్లాప్స్ తీసుకు వచ్చాయి.

Also read : Game Changer – OG : సెప్టెంబర్‌లో బాబాయ్, అబ్బాయి పోటీ ఉంటుందా.. ఓజి కోసం గేమ్ ఛేంజర్ వాయిదా..!

అంతేకాదు, ఆ సినిమా ఎండింగ్ లో యూత్ ని పవన్ ప్రశ్నిస్తూ చెప్పే డైలాగ్స్.. ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఆ ఎలక్షన్స్ ని టార్గెట్ చేసుకొని.. పలు సినిమాలు ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. దీంతో పవన్ అభిమానులు, జనసైనికులు సైతం.. గంగతో రాంబాబు సినిమాని రిలీజ్ చేయాలని కోరడంతో ఫిబ్రవరిలో రీ రిలీజ్ కి రెడీ చేశారు.

ఫిబ్రవరి 7న ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ప్రస్తుతం పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. కాగా ఆ తరువాత రోజు రవితేజ ‘ఈగల్’, జీవా ‘యాత్ర 2’, రజినీకాంత్ ‘లాల్ సలామ్’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.