Actor Priyadarshi gets emotional over negative comments on Mitra Mandali movie
Priyadarshi: తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priyadarshi). ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మిత్ర మండలి. దర్శకుడు విజేందర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సోషల్ మీడియాలో నిహారిక యెన్ఏం హీరోయిన్ గా నటిస్తుండగా.. బ్రహ్మానందం, రాగ్ మయూర్, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేష్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విడుదల కానుంది ఈ సినిమా.
Ram Pothineni: హీరోయిన్స్ తో ఆడుకుంటున్నావ్.. కాదు, వెంటతిప్పుకున్నాను.. ప్రేమకథ చెప్పిన హీరో రామ్
అయితే, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్ చేశారు. మిత్ర మండలి సినిమా ట్రైలర్ రిలీజ్ టైంలో తనకు ఎదురైనా చేదు సంఘటన గురించి వివరించాడు. “మిత్ర మండలి సినిమా ట్రైలర్ విడులయ్యాక చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నిజానికి ఇంతకుముందు ఎప్పుడు నాకు ఇలా జరగలేదు. ఒకే ఐపీ అడ్రస్ నుంచి 300 ఫేక్ ఐడీలతో కామెంట్స్ పెట్టించారు. ఇది తెలిసి నిజంగా షాకయ్యాను. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. నేను ఏదైనా తప్పు చేస్తే విమర్శించవచ్చు. కానీ ఇలా చేయడం కరక్ట్ కాదు. కేవలం ఇది నా సినిమా అని ఇలా చేస్తున్నారా, లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో తెలియదు” అంటూ చెప్పుకొచ్చాడు ప్రియదర్శి. దీంతో, ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.