Ram Pothineni: హీరోయిన్స్ తో ఆడుకుంటున్నావ్.. కాదు, వెంటతిప్పుకున్నాను.. ప్రేమకథ చెప్పిన హీరో రామ్
యంగ్ హీరో రామ్ ప్రస్తుతం ఆంధ్రకింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. (Ram Pothineni)బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనేది ట్యాగ్ లైన్. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ మహేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Hero Ram Pothineni tells his love story on the show Jayammu Nischayammu raa
Ram Pothineni: యంగ్ హీరో రామ్ ప్రస్తుతం ఆంధ్రకింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనేది ట్యాగ్ లైన్. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ మహేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీ రోల్ లో కనిపిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న(Ram Pothineni) ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు టీం. ఇందులో భాగంగానే సీనియర్ హీరో జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి హాజరయ్యాడు హీరో రామ్.
Sai Durgha Tej: బ్రో తరువాత బ్యాడ్ టైం.. రెండు సినిమాలు క్యాన్సిల్.. ఈ సినిమా చాలా కీలకం..
ఈ షోలో రామ్ ని ఆటపట్టించే ప్రశ్నలు అడిగాడు జగపతి బాబు… నువ్వు అపార్ట్మెంట్ లో సోలోగా ఉంటున్నావ్ అంటే ఎఫైర్ గ్యారెంటీ ఉండే ఉంటుంది. కొద్దికొద్దిగా వినిపిస్తున్నాయి.. అంటూ అడిగాడు. దానికి సమాధానంగా రామ్.. “లవ్ అనండి ఓకే.. మరీ ఎఫైర్ ఏంటి సార్” అని నవ్వుతు అన్నాడు. ఆ తరువాత తాను చేసిన చిలిపి పనులు చెప్పిన రామ్.. ఒక్క అమ్మాయిని పడేయడానికి చాలా కష్టాలు పడ్డాడని, చాలామంది అమ్మాయిలను వెంట తిప్పుకున్నట్లు చెప్పాడు. దానికి జగపతిబాబు.. హీరోయిన్లతో బాగా ఆడుకున్నావ్.. అని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఆంధ్రకింగ్ తాలూకా సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా విజయం రామ్ కి చాలా కీలకం. ఎందుకంటే, ఆయన చేసిన గత సినిమాలు రెడ్, డబుల్ ఇష్మార్ట్, స్కంద సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకే, ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు రామ్. మరి ఈ సినిమా రామ్ కి ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుంది అనేది చూడాలి.