Sai Durgha Tej: బ్రో తరువాత బ్యాడ్ టైం.. రెండు సినిమాలు క్యాన్సిల్.. ఈ సినిమా చాలా కీలకం..

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "సంబరాల ఏటిగట్టు".(Sai Durgha Tej) కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.

Sai Durgha Tej: బ్రో తరువాత బ్యాడ్ టైం.. రెండు సినిమాలు క్యాన్సిల్.. ఈ సినిమా చాలా కీలకం..

Hero Sai Durgha Tej emotional comments about Sambarala Yeti Gattu movie

Updated On : October 15, 2025 / 5:18 PM IST

Sai Durgha Tej: సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “సంబరాల ఏటిగట్టు”. కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రైమ్ షోస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాతో సరికొత్త కథా కథనంతో వస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్లకు పైగా(Sai Durgha Tej) ఖర్చు చేశారు మేకర్స్. ఇది హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ అవడం విశేషం. కేవలం కథ, కథనంపై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేశారట మేకర్స్.

Vishnu Priya: మత్తెక్కించే కళ్ళతో విష్ణుప్రియ.. గోల్డ్ కలర్ శారీలో అదరహో

ఇక తాజాగా హీరో సాయి దుర్గ తేజ్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచి అసుర ఆగమన పేరుతో ఒక టీజర్ ను విడుదల చేశారు. టీజర్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంది. మరీ విజువల్స్, సెటప్ అంతా ఎక్ట్రార్డినరీ గా ఉన్నాయి. ఇక సాయి దుర్గ తేజ్ మేకోవర్ కి హ్యాట్సాఫ్ అనే చెప్పాలి. కథకు తగ్గట్టుగా తన శరీరాన్ని పూర్తిగా మార్చేశాడు. ఈ ఒక్క ఎలిమెంట్ చాలు సినిమాపై మేకర్స్ ఎంత నమ్మకంగా ఉన్నారో అని చెప్పడానికి. ఇక ఈ కార్యక్రమంలో హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ఈ సినిమా తనకు కీలకం అని చెప్పుకొచ్చాడు. “బ్రో సినిమా తరువాత నేను చేయాల్సిన రెండు సినిమాలు క్యాన్సిల్ అయ్యాయి. ఆ తరువాత సంబరాల ఏటిగట్టు సినిమాలో చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం నా శాయశక్తులా కృషి చేశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమా నాకు చాలా కీలకం”అంటూ చెప్పుకొచ్చాడు సాయి దుర్గ తేజ్. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సంబరాల ఏటిగట్టు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇక కొత్త రిలీజ్ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక సంబరాల ఏటిగట్టు సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గతంలో సాయి దుర్గ తేజ్-అజనీష్ లోకనాథ్ కాంబోలో వచ్చిన విరూపాక్ష సినిమా ఎంతటి విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.