Actor Prudhvi : లైలా వివాదం.. క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ, వాడిని మాత్రం వదిలేది లేదని వార్నింగ్..

బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అని అనాలని పృథ్వీ కోరారు.

Actor Prudhvi : లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై రచ్చ రచ్చ జరిగింది. ఈ గొడవపై స్పందించిన హీరో విశ్వక్ సేన్ ఇప్పటికే సారీ చెప్పారు. అయినా ఇంకా రచ్చ జరుగుతూనే ఉండటంతో.. నటుడు పృథ్వీ స్పందించారు. ఆయన క్షమాపణలు చెప్పారు.

లైలా ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పారు పృథ్వీ. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీదా ద్వేషం లేదని ఆయన స్పష్టం చేశారు. తన వల్ల లైలా సినిమా దెబ్బతినకూడదని అందరికీ క్షమాపణలు చెపుతున్నాను అని అన్నారు. బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అని అనాలని పృథ్వీ కోరారు. ఫలక్ నుమా దాస్ దాస్ కంటే లైలా పెద్ద హిట్ కావాలని నటుడు పృథ్వీ ఆకాంక్షించారు.

”నటుడిగా, కమెడియన్ గా మాకు వెటకారం వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీదా ద్వేషం లేదు. రాజకీయాలు అంటే వేరే వేదిక మీద మాట్లాడుకుందాం వ్యక్తిగతంగా. సినిమాను కిల్ చేయకండి. సినిమాను ప్రేమిద్దాం, గౌరవిద్దాం. మనం భోజనం చేసేది సినిమా మీదే, మనకు అంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే.

Also Read : అయ్యో పాపం.. చావుతో పోరాడుతున్న రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన యువకుడు.. అసలేం జరిగిందంటే..

నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక ధృడ సంకల్పంతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే అందరికీ నేను సారీ చెబుతున్నా. ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్ కాట్ లైలా, వెల్కమ్ టు లైలా.. 14న వాలంటైన్స్ డే రోజున. లైలా యూనిట్ కు ఆల్ ద బెస్ట్. ఫలక్ నుమా దాస్ దాస్ కంటే లైలా పెద్ద హిట్ అవుతుంది. మీరంతా హ్యాపీగా ఉండండి. ధైర్యంగా ఉండండి.

రేపు విశ్వక్ సేన్ దే. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని అద్భుతంగా జరుపుకోండి. మా అన్నయ్య వీరశంకర్.. సినిమాకు ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. దాంతో నేనీ వీడియో చేశాను. సినిమా మీద గౌరవం, కళామ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేదాం. మరొక విషయం.. సినిమాకు దెబ్బ తగులుతుంది, దాని వల్ల నేను ఇలా సారీ చెప్పడం అనేది తప్పేమీ కాదు. సో అది వదిలేద్దాం.

ఆల్ ద బెస్ట్ ఫర్ లైలా టీమ్. ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒకతను నన్ను చాలా నీచంగా మాట్లాడాడు. అతడి స్థాయి, వ్యక్తిత్వం అది. నా తల్లి గురించి నీచంగా మాట్లాడాడు. ఏ దరిద్రుడు అయినా తల్లిని తిడితే మంచి మాటలు రావు. నిన్న ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కూడా నేను వెనక్కి తీసుకుంటున్నా. దటీజ్ పృథ్వీరాజ్. మా పార్టీ మాకు నేర్పినటటువంటి క్రమశిక్షణ.

Also Read : మస్తాన్ సాయి అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఆ యాప్స్‌లో పెడుతున్నాడు, 800కు పైగానే ఉన్నాయి- లావణ్య సంచలన వ్యాఖ్యలు

నీతి, నిజాయితీ. అదీ మేము నేర్చుకున్నది మా నాయకుడి దగ్గర. మా అమ్మగారు చనిపోయి 20 సంవత్సరాలైంది. ఆమె క్యారెక్టర్ ను అసాసినేషన్ చేశారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరు కూడా నాలా వీడియో పెట్టండి. పృథ్వీ రాజ్ తల్లిని తిట్టాం, మేము దరిద్రులం అని మీరూ ఒక వీడియో పెట్టండి. చాలా నీచంగా మాట్లాడారు. నా ఆరోగ్యం, ఇమేజ్ దెబ్బతినేలా చేసిన ఒక వెధవ ఉన్నాడు.

వాడిని నేను వదలను. ఇంతటితో వివాదానికి ఫుల్ స్టాప్ పెడదాం. రాజకీయంగా ఏం మాట్లాడినా మనకు చాలా చానల్స్, ఇంటర్వ్యూలు, డిబేట్లు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం గురించి మాట్లాడదాం, నా మీద విమర్శలు చేసిన వారి గురించి మాట్లాడదాం, అక్కడికి పిలిచి వారి తాట తీద్దాం” అని నటుడు పృథ్వీ రాజ్ అన్నారు.

లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ టార్గెట్ గా నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దాంతో ఆయన వైసీపీని ట్రోల్ చేశారని ఆ పార్టీ అభిమానులు ఫైర్ అయ్యారు. బాయ్ కాట్ లైలా అంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టారు. ఈ వివాదంపై స్పందించిన హీరో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఒకరు చేసిన తప్పునకు మేము ఎందుకు బలి కావాలి, ఆయన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, మా మూవీని చంపేయొద్దని విశ్వక్ సేన్ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.