Actor Rakesh Bedi has given an explanation regarding kissing actress Sara Arjun.
Rakesh Bedi: సెలబ్రెటీలు ఎం చేసిన అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక, కాస్త తేడాగా ఏమైనా బిహేవ్ చేశారంటే అంతే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఓ బాలీవుడ్ నటుడికి ఎదురయ్యింది. తనకంటే వయసులో చాలా చిన్నదైనా, తన కూతురు వయసున్న హీరోయిన్ కి అందరిముందే, స్టేజిపై ముద్దు పెట్టాడు. దీంతో, ఆ నటుడుని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ నటుడు వారెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటుడు రాకేశ్ బేడీ(Rakesh Bedi). అతను ముద్దు పెట్టిన ఆ యంగ్ బ్యూటీ మరెవరో కాదు సారా అర్జున్.
Andhra King Taluka OTT: ఓటీటీకి వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ ఇద్దరు కలిసి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘దురంధర్’. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఆ ఈవెంట్ లో భాగంగా స్టేజిపైకి వస్తున్న హీరోయిన్ సారా అర్జున్ కి ఎదురెళ్లి మరీ ముద్దు పెట్టాడు నటుడు రాకేశ్ బేడీ. దీంతో, ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్, నటుడు రాకేశ్ బేడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కూతురి వయసున్న హీరోయిన్ తో అలాచేయడానికి సిగ్గుగా లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ కామెంట్స్, నటుడు రాకేశ్ బేడీ వరకు చేరడంతో తాజాగా ఆయన హీరోయిన్ కి ముద్దు పెట్టడంపై క్లారిటీ ఇచ్చాడు. “నేను, సారా దురంధర్ సినిమాలో తండ్రీకూతుళ్లుగా నటించాము. ఆరోజు స్టేజిపైన కూడా అదే వరుసలో కూతురికి ఒక తండ్రి ప్రేమగా పెట్టినట్టుగా ముద్దు పెట్టాను. అందులో ఎలాంటి తప్పు లేదు”అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో, ఈ విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.