Ravibabu – Murari : పదేళ్ల తర్వాత ‘మురారి’ సినిమా ఏనుగు నన్ను గుర్తుపట్టింది.. రవిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు మురారి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. రవిబాబు మురారి సినిమాలో కామెడీ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Actor Ravibabu Shares Interesting Memories of Murari Movie

Ravibabu – Murari : కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా నటించిన మురారి సినిమా మహేష్ కెరీర్లో క్లాసిక్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రేపు ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలో నటించిన పలువురితో స్పెషల్ ఇంటర్వ్యూలు తీసుకొని ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో నటించిన పలువురిని ఇంటర్వ్యూలు చేయగా మురారి సినిమా జ్ఞాపకాలని పంచుకున్నారు. తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు మురారి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. రవిబాబు మురారి సినిమాలో కామెడీ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Also Read : Sobhita Dhulipala – Naga Chaitanya : నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారా?

రవిబాబు మాట్లాడుతూ.. నేను డైరెక్టర్ గా మనసారా సినిమా తీస్తున్నప్పుడు కేరళలో షూటింగ్ కి వెళ్ళాను. ఆ షూట్ సెటప్ లో ఏనుగులు, డప్పులు అన్ని ఉన్నాయి. అప్పుడు ఒక కుర్రోడు నా దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపట్టారా అని మలయాళంలో అడిగాడు. నాకు తెలీదు అన్నాను. మురారి సినిమా అని చెప్పి తన పక్కనే ఉన్న ఏనుగుని చూపించాడు. మురారి సినిమాలో ఒక ఏనుగుని నేను కిడ్నాప్ చేసే సీన్ ఉంటుంది. ఆ ఏనుగు పదేళ్ల తర్వాత మనసారా షూటింగ్ కి కూడా వచ్చింది. మురారి అప్పుడు ఆ ఏనుగు పిల్లకు కాపలాదారుడిగా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఆ కుర్రాడు వచ్చాడు. మనసారా షూటింగ్ టైంకి ఆ పిల్లోడు, ఆ ఏనుగు ఇద్దరు పెద్దోళ్ళు అయిపోయారు. ఆ ఏనుగు కూడా నన్ను చూసి గుర్తుపట్టింది. నా తల మీద తొండం పెట్టి ఆశీర్వదించింది. పదేళ్ల తర్వాత కూడా ఆ కుర్రాడు, ఏనుగు నన్ను గుర్తుంచుకున్నాయి అని తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు