సలహా ఇచ్చాడని చితకబాదారు.. రియాజ్ ఖాన్‌పై దాడి

సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పినందుకు నటుడు రియాజ్ ఖాన్‌పై దాడి చేశారు..

  • Publish Date - April 10, 2020 / 06:06 AM IST

సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్పినందుకు నటుడు రియాజ్ ఖాన్‌పై దాడి చేశారు..

మంచికిపోతే చెడు ఎదురైనట్టైంది ప్రముఖ నటుడు రియాజ్‌ఖాన్‌ పరిస్థితి. సోషల్ డిస్టెన్స్ పాటించండి అన్న పాపానికి ఆయనపై దాడి చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో నటించి గుర్తింపు పొందాడు నటుడు రియాజ్‌ ఖాన్‌. ఈయన భార్య ఉమా రియాజ్‌ ఖాన్‌ కూడా పాపులర్ నటి. పలు తమిళ్ సినిమాలు, సీరియల్స్ ద్వారా సుపరిచితురాలామె.

కాగా, రియాజ్‌ఖాన్‌ చెన్నై సమీపంలోని సముద్రతీరంలో ఉన్న పన్నయార్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. బుధవారం(ఏప్రిల్9) ఉదయం ఆ ప్రాంతంలో వ్యాయామం చేసుకుంటున్నారు. అదేసమయంలో ఆ ప్రాంతంలో కొంతమంది గుంపుగా చేరి పిచ్చాపాటి ముచ్చటించుకుంటున్నారు. దీంతో రియాజ్‌ఖాన్‌ వారిని సమీపించి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందున ప్రభుత్వం నిబంధనలు విధించింది. కాబట్టి మీరు వాటిని పాటిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోండని హితవు పలికారు.

Read Also : డ్యూటీ ఫస్ట్.. ఫ్యామిలీ నెక్స్ట్.. కరోనాపై పోరుకి కూతురు, కొడుకుతో సాయి కుమార్ షార్ట్ ఫిల్మ్..

అయితే, వారిలో కొందరు ఆయనతో వాగ్వాదానికి దిగారు. నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఉన్నట్టుండి గుంపులోని ఒక వ్యక్తి రియాజ్‌ఖాన్‌పై దాడి చేశారు. అతణ్ణి చూసి మిగతావారు కుడా చేతులు లేపారు. దీంతో కనత్తూరు పోలీసుస్టేషన్లో రియాజ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’లో నటిస్తున్నాడు రియాజ్ ఖాన్.