Actor Sathyaraj intresting comments on Mahesh Babu - Rajamouli film
Sathyaraj – SSMb29 : తమిళ నటుడు సత్యరాజ్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. బాహుబలి కట్టప్పగా ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేశాడు. వరుస చిత్రాలతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వెపన్ మూవీతో జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్‌లో అవకాశం పై స్పందించారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మీరు నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంది అని ఓ రిపోర్టర్ సత్యరాజ్‌ని అడిగాడు. దర్శకుడు రాజమౌళికి తాను ఎంతో రుణపడి ఉన్నట్లు సత్యరాజ్ చెప్పాడు. దక్షిణాదిలో అందరూ తనను సత్యరాజ్‌గా గుర్తుపడతారని చెప్పుకొచ్చాడు. అయితే.. బాహుబలి సినిమా తరువాత ప్రపంచం మొత్తానికి తాను కట్టప్పగా పరిచయం అయ్యానని, ఇక యానిమేషన్ సిరీస్ రావడంతో చిన్న పిల్లలు తనను ఇలాగే గుర్తు పడతారన్నాడు.
బాహుబలి సినిమాలో తనకు కండలు ఉన్నట్లుగా చూపించారని, ఇక యానిమేషన్‌లో అయితే ఇంకొంచెం ఎక్కువగా చూపించారన్నాడు. దీంతో బయట కూడా తాను అలాగే ఉంటానని పిల్లలు అనుకుంటారని చెప్పాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు నటించనున్న మూవీ కోసం తననెవరు సంప్రదించలేదన్నాడు. ఒకవేళ రాజమౌళి గనుక ఈ చిత్రంలో అవకాశం ఇస్తే మరో ఆలోచన లేకుండా వెంటనే అంగీకరిస్తానని సత్యరాజ్ తెలిపాడు.
ఆ బయోపిక్‌లోనూ..
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను సత్యరాజ్ ఖండించారు. మోదీ బయోపిక్‌లో తాను నటించడం లేదన్నాను. తాను కొంచెం మోదీలా కనిపిస్తానని, ఎవరో ఇద్దరి ఫోటోలను పక్క పక్కన పెట్టి ఆ బయోపిక్‌లో తాను నటిస్తున్నట్లు ఇమేజ్‌లు చేశారన్నాడు. అప్పటి నుంచి ఈ వార్త వైరల్ అవుతోందని, ఇందులో అసలు ఏ మాత్రం వాస్తవం లేదన్నాడు.
Aa Okkati Adakku : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన అల్లరోడి సినిమా..