Shayaji Shinde : మొన్న పవన్ కళ్యాణ్ ని కలిసి.. నేడు వేరే పార్టీలో చేరిన షాయాజీ షిండే..

గత కొన్నాళ్లుగా షాయాజీ షిండే రాజకీయాల్లో పోటీ చేస్తారని వినిపిస్తుంది.

Actor Sayaji Shinde joins NCP in the presence of Maharashtra Deputy CM Ajit Pawar

Shayaji Shinde : తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన షాయాజీ షిండే ప్రస్తుతం తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ని కలిసి పెద్ద గుళ్ళల్లో ప్రసాదంతో పాటు మొక్కలు కూడా ఇస్తే పచ్చదనం పెంచొచ్చు అని తన ఆలోచనని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా దీనికి సానుకూలంగా స్పందించారు.

Also Read : Lucky Baskhar : లక్కీ భాస్కర్ అప్డేట్స్.. ట్రైలర్ ఎప్పుడంటే.. ప్రీమియర్ షోలు ఎప్పట్నించి అంటే..

సినిమాలో కాకుండా ఇలా బయట పొలిటికల్ గా షాయాజీ షిండే పవన్ కళ్యాణ్ ని కలవడంతో వీరి కలయికపై ఆసక్తి నెలకొంది. కానీ పవన్ కళ్యాణ్ ని కలిసిన రెండు రోజులకే షాయాజీ షిండే వేరే రాజకీయ పార్టీలో చేరారు. మహారాష్ట్రకు చెందిన షాయాజీ షిండే నిన్న మహారాష్ట్రలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న జరిగిన ఓ సభలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆధ్వర్యంలో షాయాజీ షిండే ఆ పార్టీలో చేరారు. అజిత్ పవార్ షాయాజీ షిండేకు కండువా కప్పి ఆశీర్వదించారు.

 

అయితే గత కొన్నాళ్లుగా షాయాజీ షిండే రాజకీయాల్లో పోటీ చేస్తారని వినిపిస్తుంది. త్వరలోనే మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో షాయాజీ షిండే ఇప్పుడు ఎన్నికల ముందు NCP లో చేరడంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారేమో అని వార్తలు వస్తున్నాయి. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత షాయాజీ షిండే ఆ సభలో మాట్లాడుతూ.. నేను ఎన్నో సినిమాల్లో రాజకీయ నాయకుడిగా నటించాను. ఇప్పుడు నిజంగా రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉంది. అజిత్‌ పవార్‌ నాయకత్వం నన్ను ఆకట్టుకుంది. అందుకే ఎన్‌సీపీలో చేరాను. ఆయన నాయకత్వంలో పనిచేస్తాను అని తెలిపారు.