Lucky Baskhar : లక్కీ భాస్కర్ అప్డేట్స్.. ట్రైలర్ ఎప్పుడంటే.. ప్రీమియర్ షోలు ఎప్పట్నించి అంటే..

తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Lucky Baskhar : లక్కీ భాస్కర్ అప్డేట్స్.. ట్రైలర్ ఎప్పుడంటే.. ప్రీమియర్ షోలు ఎప్పట్నించి అంటే..

Dulquer Salmaan Lucky Baskhar Movie Updates by Director Venky Atluri and Producer Naga Vamsi

Updated On : October 11, 2024 / 6:33 PM IST

Lucky Baskhar : మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పటికే తెలుగులో మార్కెట్ తెచ్చుకొని డైరెక్ట్ వరుస తెలుగు సినిమాలు చేస్తున్నాడు. త్వరలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో రాబోతున్నాడు దుల్కర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్ రిలీజ్ చేసారు. లక్కీ భాస్కర్ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Also Read : Narudi Brathuku Natana : ‘నరుడి బ్రతుకు నటన’ ట్రైలర్ రిలీజ్.. తెలుగు నటుడు కేరళ వెళ్లి..?

ఈ ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ చివరి దశలో ఉన్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న సినిమా రిలీజ్ చేయబోతున్నాము. అక్టోబర్ 21వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేయనున్నాము. దేవర హడావుడి అయ్యాకే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాలని ఆగాము. అక్టోబర్ 26, 27 తేదీల్లో రెండు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా ప్రీమియర్ షోలు వేస్తాము అని తెలిపారు.

Dulquer Salmaan Lucky Baskhar Movie Updates by Director Venky Atluri and Producer Naga Vamsi