Narudi Brathuku Natana : ‘నరుడి బ్రతుకు నటన’ ట్రైలర్ రిలీజ్.. తెలుగు నటుడు కేరళ వెళ్లి..?

తాజాగా నరుడి బ్రతుకు నటన సినిమా ట్రైలర్ ని మెగా డాటర్ నిహారిక కొణిదెల చేతుల మీదుగా రిలీజ్ చేసారు.

Narudi Brathuku Natana : ‘నరుడి బ్రతుకు నటన’ ట్రైలర్ రిలీజ్.. తెలుగు నటుడు కేరళ వెళ్లి..?

Narudi Brathuku Natana Movie Trailer Released by Niharika Konidela

Updated On : October 11, 2024 / 6:29 PM IST

Narudi Brathuku Natana : శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘నరుడి బ్రతుకు నటన’. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మాణంలో రిషికేశ్వర్ యోగి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్.. పలువురు నరుడి బ్రతుకు నటన సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా నరుడి బ్రతుకు నటన సినిమా ట్రైలర్ ని మెగా డాటర్ నిహారిక కొణిదెల చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే.. శివ కుమార్ బాగా డబ్బున్న వ్యక్తి. అతను నటుడు అవ్వాలని ట్రై చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉంటాడు. అందరూ అతన్ని నిరుత్సాహపరుస్తూనే ఉండటంతో జీవితం అంటే ఏంటో తెలిస్తేనే నటన తెలుస్తుందని ఓ ఫ్రెండ్ చెప్పడంతో కేరళ లోని ఓ తెలియని ఊరికి వెళ్లి అక్కడ ఏం చేసాడు అనే ఆసక్తి కథగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Naga Vamsi : ‘దేవర’ మిడ్ నైట్ షోలపై నిర్మాత నాగవంశీ కామెంట్స్.. ‘గుంటూరు కారం’కు అలా.. ‘దేవర’కు ఇలా..

ఇక ఈ నరుడి బ్రతుకు నటన సినిమాలో కేరళ అందాలతో పాటు కామెడీ, ప్రేమ, ఎమోషన్.. ఇలా అన్ని ఉన్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా రిలీజయిన నరుడి బ్రతుకు నటన ట్రైలర్ మీరు కూడా చూసేయండి.