నటి శ్రావణిపై సాయి దాడి.. సీసీ దృశ్యాలు వెలుగులోకి..!

  • Publish Date - September 11, 2020 / 07:48 PM IST

Sravani Kondapalli Suicide news: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.. శ్రావణిపై సాయి దాడి చేసిన సీసీ ఫుటేజ్ లభ్యమైంది. అదే సమయంలో వచ్చి శ్రావణిపై సాయి దాడి చేసినట్టు ఆ సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. శ్రావణి ఆత్మహత్య కేసులో సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారనున్నాయి.



మరోవైపు శ్రావణి ఆత్మహత్యకు కారణం దేవరాజ్ అంటూ ఆరోపణలు రావడంతో అతడు పోలీసులకు లొంగిపోయాడు.. పోలీసులు దేవ్ రాజ్‌ను సుదీర్ఘంగా విచారణ జరిపారు.. ఈ విచారణలో సాయి కృష్ణ అకృత్యాలను దేవరాజ్ ఒక్కొక్కటిగా బయటపెట్టినట్టు సమాచారం.



సాయి కృష్ణను శ్రావణి కుటుంబ సభ్యులు కొట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో దేవరాజు చెప్పాడు. తల్లిదండ్రులు కొడుతున్నారంటూ శ్రావణి, తనతో మాట్లాడిన ఆడియోలు దేవరాజ్ పోలీసులకు ఇచ్చాడు. చావుకు సాయి కారణమని చివరిసారిగా శ్రావణి మాట్లాడిన ఆడియోను పోలీసులకు ఇచ్చాడు. గతంలోనూ దేవరాజ్‌ను సాయి రక్తం వచ్చేలా కొట్టిన సాక్ష్యాలను అందించాడు.


సాయి అనే వ్యక్తి కృష్ణా నగర్‌లో ఉన్న అమ్మాయిలను ఎక్కువగా ట్రాప్ చేస్తుంటాడని దేవరాజ్ ఆరోపించాడు. శ్రావణిని కూడా అలాగే ట్రాప్ చేశాడని దేవ్ రాజ్ చెప్పాడు. దేవరాజ్‌తో విడిపోవాలంటూ శ్రావణిని సాయి వేధింపులకు గురి చేశాడని, అతని వేదింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని విచారణలో తేలింది.