Actor Srinath Maganti playing key role in ee nagaraniki emaindi 2 movie
Srinath Maganti: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుల్లో శ్రీనాథ్ మాగంటి ఒకరు. ‘హిట్’ ఫ్రాంచైజీతో ఫేమ్ సంపాదించిన నటుడు ఆ సినిమాలో నటనకు ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ‘లక్కీ భాస్కర్’లోనూ సూరజ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. అలాగే కల్ట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ‘యానిమల్’తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటారు యువ నటుడు. ఆ సినిమాలో రష్మిక బ్రదర్ రోల్ చేశారు. ఇప్పుడు మరో క్రేజీ సినిమాలో ఆఫర్ కొట్టేశాడు శ్రీనాథ్ మాగంటి(Srinath Maganti).
Pawan Kalyan: ప్లీజ్.. మీ ఇద్దరూ మళ్ళీ సినిమా చేయండి.. ఎస్ జె సూర్యకి జయం రవి రిక్వెస్ట్
అదే దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది 2’. బ్లాక్ బస్టర్ ఈ నగరానికి ఏమైంది సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, స్నేహం నేపథ్యంలో ఈ నగరానికి ఏమైంది సినిమా తెరకెక్కించిన తరుణ్ భాస్కర్.. ‘ఈ నగరానికి ఏమైంది 2’ కోసం కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకున్నాడట.
ఈ సినిమాలో శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. నలుగురు హీరోల్లో తను ఒకడు. అదే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో కార్తీక్ పాత్ర. ఆ పాత్ర చేసిన నటుడు సుశాంత్ సీక్వెల్ లో నటించడం లేదని తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చేశాడు. కాబట్టి, సుశాంత్ స్థానంలోనే శ్రీనాథ్ మాగంటి చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది? త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.