×
Ad

Suman : నవీన్ గెలుపు పై సుమన్ కామెంట్స్.. శ్రీశైలం యాదవ్ నాకు క్లోజ్ ఫ్రెండ్.. నా కోసం 4 లారీల్లో జనాల్ని పంపి..

10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ నవీన్ యాదవ్ గెలుపు గురించి మాట్లాడారు. అలాగే శ్రీశైలం యాదవ్ గురించి మాట్లాడారు. (Suman)

Suman

Suman : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గెలుపొందారు. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, అతని ఫ్యామిలీకి నటుడు సుమన్ చాలా క్లోజ్. ఇటీవల నవీన్ యాదవ్ కోసం సుమన్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు సుమన్ నేడు 10 టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.(Suman)

10 టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ నవీన్ యాదవ్ గెలుపు గురించి మాట్లాడారు. అలాగే శ్రీశైలం యాదవ్ గురించి మాట్లాడారు.

Also Read : Nagarjuna : వామ్మో.. నాగార్జునకు లంచ్ లో రోజూ ఆ కర్రీ ఉండాల్సిందే.. ఎక్కువ మందికి అది ఇష్టం ఉండదు..

Suman

సుమన్ మాట్లాడుతూ.. చెన్నై నుంచి హైదరాబాద్ కు సినీ పరిశ్రమ వచ్చినప్పుడు జూబ్లీహిల్స్ లో ఉండేవాడిని. అప్పుడు ఇక్కడ ఏం లేవు. అదే ఊరిచివర ఉన్నట్టు ఉంటుంది. ఆ సమయంలో చిన్న శ్రీశైలం యాదవ్, తలసాని, దానం నాగేందర్, శ్రీహరి.. ఇలా అందరూ పరిచయం అయ్యారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే శ్రీశైలం యాదవ్ సాల్వ్ చేసేవారు. యూసుఫ్ గూడలో షాప్ ఓపెనింగ్స్ లో వెళ్తే శ్రీశైలం యాదవ్ అక్కడ క్లోజ్ అయ్యారు. పండగల సమయంలో చందాలు అని కొంతమంది రాత్రి పూట వచ్చి డబ్బులు అని మా ఇంటిదగ్గర హడావిడి చేసేవాళ్ళు, సెక్యూరిటీని కొట్టేవాళ్ళు. ఇది చాలా సార్లు రిపీట్ అయ్యేది.

ఒకరోజు అలాగే వస్తే నేను శ్రీశైలం యాదవ్ కి ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉండు అని చెప్పి నాలుగు లారీల మనుషులను పంపించాడు. దాదాపు 200 మంది మనుషులను పంపించాడు. చందాలకు వచ్చినవాళ్లు ఇది చూసి బెదిరిపోయారు. ఆ సంఘటనతో నాకు శ్రీశైలం యాదవ్ బాగా క్లోజ్ అయ్యారు. మీకు ఏం సమస్య ఉన్నా నాకు చెప్పండి అనేవారు. నేను వెళ్లే కరాటే ఫంక్షన్స్ కి స్పాన్సర్ చేసేవాళ్ళు. తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాము అని తెలిపారు.

Also Read : Vijayasai Reddy: జగన్ కు నా సూచన ఏంటంటే.. విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్

నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు శ్రీశైలం అన్న కొంచెం డిప్రెషన్ కి వెళ్లారు. ఈసారి కూడా నిలబెడతాను అని చెప్తే ఏ పార్టీలో టికెట్ వచ్చినా ఓకే నాకు ఎప్పుడు రావాలో చెప్పండి వస్తాను. వచ్చి నవీన్ యాదవ్ కోసం ప్రచారం చేస్తాను అని చెప్పాను. వచ్చి ప్రచారం చేశాను. నవీన్ చిన్నప్పటి నుంచి చూసాను. నా ఫ్రెండ్ కొడుకు. శ్రీశైలం అందరికి చాలా హెల్ప్ లు చేసారు. సినిమా వాళ్లకు కూడా చాలా మందికి సహాయం చేసారు.

ఈ మూడేళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మీ పనులు అవ్వాలంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలి, సెంటర్ ఇక్కడ హెల్ప్ చేయదు. ప్రతిపక్షం చేయదు అని ప్రచారం చేశాను. నన్ను అడిగారు నవీన్ గురించి రౌడీ అని.. నవీన్ మీద కేసులు ఉంటే అసలు టికెట్ ఎలా వస్తుంది? శ్రీశైలం గురించి కూడా నాకు చాలా చెప్పారు. అవన్నీ కూడా నాకు తెలీదు నాకు సపోర్ట్ చేసాడు, హెల్ప్ చేసాడు అందుకే ఆయనకు నేను చేస్తాను. ఆయన అంటే నాకు ఇష్టం అని తెలిపారు. దీంతో సుమన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Vrushakarma : నాగచైతన్య కొత్త సినిమా టైటిల్ ‘వృషకర్మ’.. దీని అర్ధం ఏంటో తెలుసా?