Suman
Suman : హీరోగా, నటుడిగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు సుమన్. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. తన సినీ కెరీర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. తాజాగా 10 టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయం తెలిపారు సుమన్.(Suman)
సుమన్ అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సుమన్ లైఫ్ నే మార్చేసింది. తెలుగు వారి గుండెల్లో ఆ సినిమా, ఆ పాత్ర ఎప్పటికి నిలిచిపోయింది. అయితే ఆ సినిమా వల్ల జరిగిన ఓ సంఘటనని పంచుకున్నారు.
Also Read : Annamayya : ‘అన్నమయ్య’ చెయ్యను అని చెప్పా.. వేంకటేశ్వరస్వామి పాత్రపై సుమన్ కామెంట్స్ వైరల్.. పాపం 8 నెలలు..
సుమన్ మాట్లాడుతూ.. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ వేంకటేశ్వరస్వామి భక్తుడు. ఆయన ఒకసారి ఇక్కడికి వస్తే ఇలా అన్నమయ్య సినిమా వచ్చింది చూడండి అని ఆయనకు ఎవరో చెప్పారు. ఆయన వేంకటేశ్వరస్వామి పాత్ర ఎవరు చేశారో ఆయనను రమ్మనండి ఆయనతో కలిసి చూస్తాను అన్నారట. నాకు కబురు వస్తే వెళ్ళాను. ప్రసిడెంట్ గారితో కూర్చొని సినిమా మొత్తం చూసాను. ఆ రోజు ఆయనతో కూర్చొని డిన్నర్, టీ, లంచ్ చేశాను. ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా నాకు హాఫ్ డే టైం ఇచ్చారు. అంతకంటే ఇంకేం కావాలి నాకు అదే పెద్ద సక్సెస్ అని అన్నారు.