Suriya : డైరెక్టర్ బాల సినిమా నుంచి తప్పుకున్న సూర్య.. ఆగిపోయిన సినిమా.. పాపం కృతిశెట్టి..
తమిళ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ బాల కాంబినేషన్ లో వచ్చిన శివపుత్రుడు, నంద సినిమాలు భారీ విజయం సాధించి అవార్డులని కూడా తెచ్చిపెట్టాయి. కొన్నాళ్ల క్రితం వీరి కాంబినేషన్ లో మూడో సినిమా అనౌన్స్ చేశారు.............

Actor Suriya has opted out of Vanangaan movie said by director Bala
Suriya : తమిళ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ బాల కాంబినేషన్ లో వచ్చిన శివపుత్రుడు, నంద సినిమాలు భారీ విజయం సాధించి అవార్డులని కూడా తెచ్చిపెట్టాయి. కొన్నాళ్ల క్రితం వీరి కాంబినేషన్ లో మూడో సినిమా అనౌన్స్ చేశారు. దీంతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. బాల డైరెక్షన్ లో సూర్య మరో హిట్టు కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు. ఇందులో ఒక హీరోయిన్ గా కృతిశెట్టిని కూడా తీసుకున్నారు.
తమిళ్ లో ‘వనన్‌గాన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘అచలుడు’ పేరుతో ప్రకటించారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా కన్యాకుమారిలో పూర్తి చేశారు. అయితే సడెన్ గా సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు డైరెక్టర్ బాల అధికారిక ప్రకటన ఇచ్చారు. దీంతో అంత షాక్ అయ్యారు. కథలో సూర్య మార్పులు అడగడంతో బాల ఒప్పుకోలేదు, దీంతో సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకి సూర్యనే నిర్మాత కావడం విశేషం.
Madhur Bhandarkar : రీమేక్ సినిమాలు ఇకనైనా ఆపేయండి.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వ్యాఖ్యలు..
త్వరలోనే ఈ సినిమాని మరో యాక్టర్ తో మొదలుపెడతామని బాల ప్రకటించారు. మరి అప్పుడు సూర్య నిర్మాతగా ఉంటారా, ఉండరా చూడాలి. తెలుగులో ఫుల్ ఫామ్ లో ఉన్న కృతిశెట్టి తమిళ్ లో మొదట ఒప్పుకున్న సినిమా ఇదే. సూర్య సినిమాతో తమిళ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుందని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది కృతిశెట్టి. తనకి తమిళ్ లో మంచి ఎంట్రీ వస్తుందని భావించింది. కానీ సడెన్ గా సినిమా ఆగిపోవడంతో అంతా పాపం కృతిశెట్టి అనుకుంటున్నారు. స్టార్ హీరోతో తమిళ్ లో ఎంట్రీ ఇద్దామనుకున్న ఆశలు ఆవిరైపోయాయిగా అని కృతి అభిమానులు కూడా భాదపడుతున్నారు. సూర్య-బాల కాంబోలో హిట్ కొడతారు అనుకున్న సూర్య అభిమానులు కూడా సినిమా ఆగిపోవడంతో నిరాశ చెందుతున్నారు.
Herewith we share the official note from the Desk of Director #Bala @IyakkunarBala @rajsekarpandian @2D_ENTPVTLTD#DirBala #வணங்கான் #Vanangaan pic.twitter.com/hXKsHHfD08
— Done Channel (@DoneChannel1) December 4, 2022