ET Teaser: మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు.. సూర్యా యాక్షన్ ఫ్యాక్డ్ ‘ఈటీ’ టీజర్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ఎతర్క్కుం తునింధవన్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరోనా సమయంలో ఓటిటి ద్వారా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య ఈసారి..

Et Teaser

ET Teaser: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ఎతర్క్కుం తునింధవన్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరోనా సమయంలో ఓటిటి ద్వారా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య ఈసారి మాత్రం థియేటర్లలోకి పాన్ ఇండియా లెవెల్లో వచ్చేందుకు సిద్దమయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 10న ఈ ET రిలీజ్ కు రెడీగా ఉంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నటుడు సూర్యకు జంటగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది.

Adavallu Meeku Joharlu: వెనక్కి తగ్గిన శర్వానంద్.. కొత్త డేట్ ఎప్పుడంటే?

పాండిరాజ్ దర్శకత్వంలో ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. కాగా, రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో పాన్ ఇండియా లెవెల్ లో యూనిట్ ప్రచారం మొదలు పెట్టింది. తెలుగులో ‘ఈటీ’ పేరుతో ప్రేక్షకులను అలరించనున్న ఈ సినిమా టీజర్ ను శనివారం విడుదల చేశారు. ఇందులో సూర్య చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్ కనిపిస్తుంది.

Suriya : సూర్య ’24’ సినిమాకి సీక్వెల్.. త్వరలో ప్రకటన..

నాతో ఉండేవేళ్ళెప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ సూర్య మాస్ డైలాగ్స్, యాక్షన్ ట్రైలర్ లో కనిపిస్తుంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత సూర్య నుండి రాబోతున్న సూర్య సినిమా కావడం.. చాలాకాలం తర్వాత ఆరు, దేవా లాంటి మాస్ యాక్షన్ సినిమా కావడంతో ఈటీపై భారీ అంచనాలున్నాయి.