×
Ad

Actor Vijay: ఓటర్లకు హీరో విజయ్ క్షమాపణలు

ఇళయ దళపతి విజయ్ ఓటు వేసేందుకు వచ్చి తన వల్ల ఇబ్బందులు పడ్డందుకు క్షమాపణలు చెప్పారు.

  • Published On : February 19, 2022 / 08:56 PM IST

Actor Vijay

Actor Vijay: ఇళయ దళపతి విజయ్ ఓటు వేసేందుకు వచ్చి తన వల్ల ఇబ్బందులు పడ్డందుకు క్షమాపణలు చెప్పారు. తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదలపతి విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, పోలింగ్ బూత్‌‌కి వచ్చిన విజయ్‌ని ఫొటోలు తీసుకునేందుకు మీడియా, అభిమానులు పోటెత్తారు.

ఈ సమయంలో అక్కడ కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన సాధారణ ప్రజలు ఇబ్బంది ఫీల్ అయ్యారు. ప్రజల అసౌకర్యాన్ని గమనించిన విజయ్.. అక్కడివారికి క్షమాపణలు చెప్పాడు. విజయ్ క్షమాపణలు చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇళయదలపతి విజయ్ అభిమానులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ‘‘దలపతి విజయ్ మక్కల్ ఇయక్కం’’ పార్టీ పేరుతో పోటీ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ ‘బీస్ట్’ సినిమాలో నటిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తోంది.