Rowdy Boy Vijay Devarakonda : విజయ్ దేవరకొండ మంచి మనస్సు..పేదవారికి రూ. 10 లక్షల సహాయం

బాగా అవసరం ఉన్నవాళ్లు.. వాళ్ళ మెయిల్ ఐడీ నుంచి రౌడీ క్లబ్‌లో రిజిస్టర్ కావాలని సూచించాడు విజయ్. ఒకవేళ రౌడీ క్లబ్‌లో సభ్యులు అయితే...

Vijay Devarakonda

Actor Vijay devarakonda : టాలీవుడ్‌ రౌడీ బాయ్‌, స్టార్‌ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. పండగ కానుకగా పేదవారికి 10 లక్షల సహాయం ప్రకటించాడు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా..తన తరపు నుంచి 100 మందికి ఒక్కొక్కరికి 10 వేల చొప్పున సహాయం చేయబోతున్నట్టు ప్రకటించాడు. జనవరి 1న డబ్బులు ఇస్తానని విజయ్‌ వెల్లడించాడు. అయితే ఇది బాగా అవసరం ఉన్నవారికి.. పండగ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు.. అర్జెంట్ అవసరం ఉన్నవాళ్లు మాత్రమే తీసుకోవాలని రిక్వెస్ట్ చేశాడు విజయ్. దీని కోసం ఓ ఫార్మెట్‌ను కూడా ప్రకటించాడు రౌడీ హీరో.

Read More : Back Door Review: హద్దులు దాటమనే వయసు.. తప్పని చెప్పే మనసు.. ‘బ్యాక్ డోర్’

బాగా అవసరం ఉన్నవాళ్లు.. వాళ్ళ మెయిల్ ఐడీ నుంచి రౌడీ క్లబ్‌లో రిజిస్టర్ కావాలని సూచించాడు విజయ్. ఒకవేళ రౌడీ క్లబ్‌లో సభ్యులు అయితే… రౌడీ కోడ్ లేదా రౌడీ ఐడీ పేర్కొనాలన్నారు. వంద మందిలో కనీసం యాభై మంది రౌడీ కమ్యూనిటీ సభ్యులు ఉండేలా చూస్తానని విజయ్‌ దేవరకొండ హామీ ఇచ్చారు. విజయ్ ఇలా సాయం చేయడం ఇప్పుడు కొత్తేం కాదు. కోవిడ్ పీక్స్‌లో ఉన్నప్పుడు.. మిడిల్ క్లాస్ వారిని ఆదుకోవడానికి మిడిల్ క్లాస్ ఫండ్‌ను పెట్టాడు. వారికి కావల్సిన కిరాణ సరుకులు, రౌడీ క్లబ్ వాలంటీర్స్‌తో ఇంటికే పంపించాడు. ఇలా ప్రతీ విషయంలో తనవంతు సాయం అందిస్తూనే ఉన్నాడు విజయ్.

Read More : Mega Family: మెగా యంగ్ హీరోస్.. అంతా ఒకే ఫ్రేములో!

మరోవైపు…సినిమా టికెట్ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశారు. జీవోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు విజయ్. ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ జరుగుతోంది. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా చేస్తుండగా.. కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో డిసెంబర్ ‌31వ తేదీన లైగర్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. స్పోర్ట్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైక్‌ టైసన్‌ కీలకపాత్రలో కనిపించబోతున్నారు.