Arshi Khan : తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘాన్.. క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న నటి.

ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఓ నటి తన నిశ్చితార్ధం రద్దు చేసుకుంది.

Arshi Khan

Arshi Khan : ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచి ఉద్రికత్త పరిస్థితి నెలకొన్నాయి. అక్కడ హింస కూడా విపరీతంగా పెరిగింది. అంతర్జాతీయ వాణిజ్యం నిలిచిపోయింది. ప్రజలు తాలిబన్ల బాధలు పడలేక ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. అఫ్ఘాన్ పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో నిశ్చితార్థం రద్దు చేసుకుంది బిగ్‌బాస్‌ సీజన్‌ 11, 14 కంటెస్టెంట్‌ అర్షి ఖాన్.

ఈ ఏడాది అక్టోబర్ లో ఆఫ్ఘానిస్తాన్ క్రికెటర్ తో ఈమెకు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా కుటుంబ సభ్యులు రద్దు చేసినట్లు అర్షి ఖాన్ తెలిపారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ పెళ్లి ఆగిపోయినట్లే అని తెలిపింది. ఆఫ్ఘానిస్తాన్ క్రికెటర్‌తో తన నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. కానీ తాలిబన్లు.. ఆఫ్ఘాన్ ను ఆక్రమించడంతో అది కాస్త రద్దయ్యిందని తెలిపారు.

సదరు క్రికెటర్ తన తండ్రి స్నేహితుడని, అందుకే తన తండ్రి అతడికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. తాలిబన్లు ఆఫ్ఘాన్ను ఆక్రమించడంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాం. అయినప్పటికి కూడా మేం మంచి మిత్రులుగానే ఉన్నాం. ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నాకనిపిస్తుంది.. నా జీవిత భాగస్వామి తప్పకుండా భారతీయ వ్యక్తే అయి ఉంటాడు’’ అని తెలిపారు.

ఇక ఆమె తమ మూలాల గురించి చెబుతూ.. తాము ఆఫ్ఘానిస్తాన్ ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చినట్లు తెలిపారు. నాలుగేళ్ళ వయసున్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఇండియాకు వచ్చి ఇక్కడే సెటిల్ అయినట్లు తెలిపారు. తనది ఆఫ్ఘాన్ పఠాన్ వంశమని నటి చెప్పుకొచ్చారు. కాగా అర్షి ఖాన్‌ బిగ్ బాస్ సీజన్‌ 11 లో పాల్గొన్నారు. ఆ తర్వాత 14వ సీజన్‌లో ఛాలెంజర్‌గా షోలో తిరిగి ప్రవేశించారు.

అర్షి ‘సావిత్రి దేవి కాలేజ్ అండ్‌ హాస్పిటల్’, ‘విష్’, ‘ఇష్క్ మే మార్జవాన్’ వంటి టీవీ షోలతో పాటు అనేక ఇతర రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోలలో కనిపించారు.