Ashu Reddy Tells about a Person who love her Sincerely got Emotional
Ashu Reddy : టిక్ టాక్ వీడియోలు, రీల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక టీవీ షోలు, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెగ్యులర్ గా వైరల్ అవుతుంది. ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాల్లో క్యారెక్టర్స్ తో బిజీగానే ఉంది.
సుధీర్ హోస్ట్ చేసే ఫ్యామిలీ స్టార్ షోలో అషురెడ్డి రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తుంది. ఓ ఎపిసోడ్ లో మీరు ఎవరికైనా సారీ చెప్పాలి అనుకుంటున్నారా అని సుధీర్ అడగ్గా అషురెడ్డి ఓ ఎమోషనల్ స్టోరీ చెప్పింది.
Also Read : Ashu Reddy : అషురెడ్డిలో ఇంత బాధ ఉందా.. బ్రెయిన్ ట్యూమర్.. రాత్రికి రాత్రి సర్జరీ.. హెయిర్ తీసేసి..
అషురెడ్డి మాట్లాడుతూ.. ఒక అబ్బాయి నన్ను సీరియస్ గా లవ్ చేశాను అని టెన్త్ లో ఒకసారి ప్రపోజ్ చేస్తే కంప్లైంట్ చేశాను. అప్పట్లో ఆర్కుట్ అని సోషల్ మీడియా ఉండేది. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఆర్కుట్ కూడా ప్రపోజ్ చేస్తే అది కూడా పేరెంట్స్ కి, టీచర్స్ కి చూపించి కంప్లైంట్ చేశాను. డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాక ఒక రోజు అతను చనిపోయాడని కాల్ వచ్చింది. చివరగా చూడటానికి రమ్మంటే వెల్దాములే అని అనుకున్నాను. కానీ వాళ్ళ అమ్మ నాకు కాల్ చేసి నువ్వు మాత్రం రావొద్దు. నిన్ను నిజంగా ప్రేమించాడు, నువ్వు జాయిన్ అయిన కాలేజిలోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేసాడు. నీ నంబర్ కోసం రకరకాలుగా ట్రై చేసాడు అని చెప్పింది. అంత సీరియస్ గా లవ్ చేసాడని అతను చనిపోయేదాకా నాకు తెలియలేదు. అతని చివరి చూపుకు వెళ్ళలేదు అని ఆ తర్వాత బాధపడ్డాను. అతనికి సారీ చెప్పాలి. ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అతను అని చెప్తూ ఎమోషనల్ అయింది.