Ashu Reddy : బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడ్డ అషురెడ్డి.. రాత్రికి రాత్రి సర్జరీ.. హెయిర్ తీసేసి..

అషు తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో అనేక ఆసక్తికర అంశాలు మాట్లాడింది.

Ashu Reddy : బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడ్డ అషురెడ్డి.. రాత్రికి రాత్రి సర్జరీ.. హెయిర్ తీసేసి..

Ashu Reddy Effected with Brain Tumor got Surgery

Updated On : April 6, 2025 / 8:45 AM IST

Ashu Reddy : టిక్ టాక్ వీడియోలు, రీల్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ తర్వాత మరింత పాపులర్ అయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక టీవీ షోలు, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెగ్యులర్ గా బిజీగానే ఉంది. అషురెడ్డి ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తుంది.

అషు తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో అనేక ఆసక్తికర అంశాలు మాట్లాడింది. ఈ క్రమంలో అషురెడ్డికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని, హెయిర్ తీసేసి సర్జరీ చేసారని తన బాధ చెప్పింది.

Also See : ప్రదీప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి లవ్ మెలోడీ సాంగ్ విన్నారా? విజువల్స్ అదిరిపోయాయిగా..

అషురెడ్డి మాట్లాడుతూ.. 2024లో కామాఖ్య టెంపుల్ కి వెళ్ళినప్పుడు బాగా తలనొప్పి వచ్చింది. అస్సలు తగ్గలేదు. ఇంటికి వచ్చేదాకా అయిదు రోజులు డోలో ట్యాబ్లేట్ తో మెయింటైన్ చేశాను. ఇంటికొచ్చి పడుకుండిపోయాను. ఇంట్లో కూడా లేపలేదు. మూడు రోజులు అలాగే ఎక్కువగా పడుకొని ఉన్నాను. హెడ్ అంతా బరువుగా ఉంది. తల లేపలేకపోయాను. దాంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి టెస్టులు చేయిస్తే బ్రెయిన్ లో టమాటా సైజ్ అంతా ట్యూమర్ ఉంది. డాక్టర్స్ షాక్ అయ్యారు. ఎలాంటి లక్షణాలు లేకుండా ట్యూమర్ ఉండటం చూసి షాక్ అయ్యారు.

Ashu Reddy

అపోలో హాస్పిటల్ లో ఓవర్ నైట్ ఆపరేషన్ కి రెడీ చేసారు. డబ్బులు కూడా ముందే అడగలేదు, ముందు సర్జరీ చేసారు. హాస్పిటల్ లో 10 రోజులు ఉన్నాను. సగం పైగా హెయిర్ తీసేసారు. ఆ ట్యూమర్ తీసేటప్పుడు నరాలు ఏవన్నా డిస్టర్బ్ అవుతాయి ఆపరేషన్ తర్వాత ఏదైనా జరగొచ్చు అని నన్ను ముందే ప్రిపేర్ చేసారు. మెమరీ లాస్ కూడా అయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఆపరేషన్ అయ్యాక అంతా బాగానే ఉంది. కాకపోతే గట్టిగా మాట్లాడలేను. పెయిన్ వచ్చేస్తుంది. ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలి అన్నారు. కానీ ఆరు నెలలు ఏం చేయాలి ఖాళీగా కూర్చొని. అందుకే హెయిర్ లేకపోయినా రెండు నెలల్లో షూట్ కి వచ్చాను. హెయిర్ స్టయిలిష్ట్స్ విగ్స్ తో సెట్ చేయడానికి బాగా కష్టపడ్డారు. మళ్ళీ వర్క్ లో బిజీ అవ్వడం వల్లే బాగా రికవర్ అయ్యాను అని తెలిపింది.

Also Read : Peddi : రామ్‌చ‌ర‌ణ్‌ ‘పెద్ది’ గ్లింప్స్‌పై క్రేజీ టాక్‌..

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అలరించే అషు, టీవీ షోలలో నవ్వించే అషు వెనక ఇంత బాధ ఉందా.. తనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి సర్జరీ జరిగిందా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం అయితే పూర్తిగా కోలుకుందనే తెలిపింది అషురెడ్డి.