Actress Bhumi Pednekar shares selfie from hospital bed
Bhumi Pednekar : ప్రముఖ బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఆస్పత్రి పాలైంది. గత ఎనిమిది రోజులుగా నరకం అనుభవిస్తున్నానంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఆస్పత్రిలో బెడ్‌పై ఇలా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని తెలిపింది. రెండు సెల్ఫీ ఫొటోలను షేర్ చేసింది. అది చూసిన ఆమె ఫ్యాన్స్ తనకు ఏమైందోనని కంగారుపడ్డారు. అసలు ఏమైందో ఈ బాలీవుడ్ బ్యూటీ రివీల్ చేసింది. తనకు డెంగ్యూ సోకిందని వెల్లడించింది.
Read Also : Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ హౌస్‌లో హత్య.. ! హంతకులను కనిపెట్టేది ఎలా..?
గత కొన్నిరోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాని, ఒక దోమ కారణంగా ఇలా ఆస్ప్తత్రి పాలవ్వాల్సి వచ్చిందని తెలిపింది. కాలుష్య స్థాయిల కారణంగా డెంగ్యూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయని, అభిమానులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోస్టులో పేర్కొంది. ఫ్యాన్స్‌కు దోమల నివారిణిని ఉపయోగించాలని అభ్యర్థించింది. ఎనిమిది రోజుల తర్వాత ఇప్పుడే తాను నెమ్మదిగా కోలుకుంటున్నానని భూమి తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.
అంతేకాదు.. ‘అభిమానులందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గత కొన్ని రోజులు నేను నా కుటుంబం డెంగ్యూ కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నాం. ప్రస్తుతం దోమల నివారణి తప్పనిసరి. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి. అధిక కాలుష్య స్థాయిలు మన రోగనిరోధక శక్తిని చాలా వరకు దెబ్బతీస్తాయి. నాకు తెలిసిన కొంతమందికి ఇటీవల డెంగ్యూ వచ్చింది’ అని పోస్టులో పేర్కొంది.
Actress Bhumi Pednekar
తనను బాగా చూసుకున్నందుకు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. ‘ఏక్ డెంగ్యూ కే మచార్ నే, ముఝే 8 దిన్ కా భారీ టార్చర్ దే దియా’ అని పోస్టు క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఈరోజే కొంచెం మేల్కొన్నాను. అందుకే సెల్ఫీ ఫొటోలను షేర్ చేశానని తెలిపింది. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాల విషయానికి వస్తే.. భూమి చివరిగా ‘ది లేడీ కిల్లర్’, ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’లో కనిపించింది. ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.
సినీ పరిశ్రమలో మహిళా నటుల సమస్యలపై తరచుగా మాట్లాడే భూమి పెడ్నేకర్.. శుభ మంగళ్ సావధాన్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ వంటి అనేక మూవీల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మేరీ పట్నీ కా రీమేక్ అనే మూవీలో అర్జున్ కపూర్ కు జోడీగా కనిపించనుంది. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించే ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించనుంది.
Read Also : Animal Run Time : యానిమల్ సినిమా రన్‌టైమ్ ఫిక్స్.. వామ్మో అన్ని గంటల మూవీనా..!