Animal Run Time : యానిమల్ సినిమా రన్‌టైమ్ ఫిక్స్.. వామ్మో అన్ని గంటల మూవీనా..!
Animal Run Time locked : రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం యానిమల్.

Animal Run Time locked
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. ఈ సినిమాకి సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటల వల్ల బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 1 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర రన్‌టైమ్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతుండగా తాజాగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్పందించారు.
యానిమల్ సినిమా రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు అంటూ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు తెలియజేశారు. దీన్ని చూసిన నెటీజన్లు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల కాలంలో విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక రన్ టైం ఉన్న సినిమా ఇదే కానుంది. గతంలో 2016లో ‘ధోని’ సినిమా 3 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌తో విడుదలైంది.
Naga Chaitanya : NC23 టైటిల్ ఏంటో తెలుసా? సరికొత్తగా ఉందే.. తన వాళ్ళ కోసం నిలబడిన నాయకుడు..
దాదాపు మూడున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్లలలో కూర్చోపెట్టడం అంటే చాలా కష్టమనే చెప్పాలి. దర్శకుడు సందీప్‌కు తన కథ పై ఉన్న నమ్మకం తోనే రన్‌టైమ్‌ను కుదించలేదని తెలుస్తోంది. ఇక ఆయన తెలుగులో తీసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా సైతం మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమానే. ఇదే సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరక్కించారు. అయితే.. ఆ సమయంలో నిడివి తగ్గించారు.
Censor rating for ANIMAL is A 🙂
3 hour 21 minutes 23 seconds & 16 frames is the Runtime 🙂#AnimalTheFilm
Releasing on Dec 1st@VangaPictures@TSeries— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 22, 2023
ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్ర ట్రైలర్‌ను నవంబర్ 23న విడుదల చేయనున్నారు.
Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ హౌస్‌లో హత్య.. ! హంతకులను కనిపెట్టేది ఎలా..?