Divi : అన్ని రోజులు డబ్బింగ్ చెప్పాను.. కానీ పుష్ప 2లో నా సీన్స్ తీసేసారు.. పుష్ప 3లో..

తాజాగా దివి ఓ ఇంటర్వ్యూలో పుష్ప 2 లో తన సీన్స్ తీసేయడం గురించి మాట్లాడింది.

Actress Divi Comments on Removing her Scenes in Pushpa 2

Divi : మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన దివి పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత మాత్రం దివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సినిమాలు, సిరీస్ లలో ఛాన్సులు దక్కించుకుంది. పలు చిన్న సినిమాలలో, సిరీస్ లలో హీరోయిన్ గా నటిస్తూనే పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. ఇటీవల పుష్ప 2, డాకు మహారాజ్ సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

దివి పుష్ప 2 సినిమాలో ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది. అల్లు అర్జున్ కాంబినేషన్లో రెండు సీన్స్ కూడా ఉన్నాయి. దివి సినిమాలో ఆల్మోస్ట్ అయిదారు సీన్స్ లో కనిపిస్తుంది. సినిమా రిలీజ్ కి ముందు ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో దివినే హైలెట్ అయింది. కానీ సినిమాలో ఆ సీన్స్ లేవు. తర్వాత 20 నిముషాలు యాడ్ చేసి రిలీజ్ చేసిన దాంట్లో కూడా దివి సీన్స్ లేవు. పుష్ప 2 చాలా ఎక్కువ కంటెంట్ తీసి ఎడిటింగ్ చేసారని తెలిసిందే. ఈ ఎడిటింగ్ లో దివి సీన్స్ కూడా చాలానే తీసేశారంట.

Also Read : Thandel Trailer : నాగచైతన్య – సాయి పల్లవి ‘తండేల్’ ట్రైలర్ వచ్చేసింది.. శ్రీకాకుళం యాసలో అదరగొట్టారుగా..

తాజాగా దివి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పుష్ప 2 లో తన సీన్స్ తీసేయడం గురించి మాట్లాడింది.

దివి మాట్లాడుతూ.. ఎడిటింగ్ లో నా పాత్ర తీసేసారు. సినిమాకు పదిమంది ఫ్రెండ్స్ తో వెళ్ళాను. సినిమా చూసేదాకా కూడా నాకు తెలియదు ఎడిటింగ్ లో తీసేసారు అని. సినిమా అంతా అయ్యాక నా సీన్స్ లేవు. నా ఫ్రెండ్స్ అడిగారు. సినిమా షూటింగ్ తో పాటు డబ్బింగ్ కి కూడా ఎక్కువ రోజులు వెళ్ళాను. బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ ఉంది, డైలాగ్స్ యాడ్ చేసారు అని డబ్బింగ్ కి చాలా సార్లు పిలిచారు. ఆల్మోస్ట్ 10 డేస్ డబ్బింగ్ కి వెళ్ళాను. పేజీలు పేజీలు డబ్బింగ్ చెప్పాను. నేను కూడా ఎంత ఎక్కువ ఉంటే నాకే అంత మంచిది అని యాక్టివ్ గా వెళ్ళాను. కాకపోతే ఎడిటింగ్ లో నా సీన్స్ తీసేసారు. అంత పెద్ద సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటిది జరుగుతుంది. అలాంటి భారీ పాన్ ఇండియా సినిమాలో నాకు క్లోజ్ పడింది, నేను కనపడ్డాను అది చాలు. పుష్ప 2 సినిమాకు 26 రోజులు షూట్, 10 రోజులు డబ్బింగ్ కి వర్క్ చేశాను. పుష్ప 3లో నా రోల్ ఉంది అనుకుంటున్నాను. ఈ సినిమా వల్ల బన్నీ గారు, సుకుమార్ లాంటి స్టార్స్ తో వర్క్ చేశాను అని తెలిపింది.

Also Read : Comedian Ali : మరోసారి పెళ్లి చేసుకున్న కమెడియన్ అలీ.. వీడియో వైరల్.. దగ్గరుండి పెళ్లి చేసిన కూతుళ్ళు..

దీంతో దివి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే దివి సీన్స్ మాత్రమే కాదు చాలా సీన్స్ ఎడిటింగ్ లో తీసేసారు. ఇక దివి ఇదే ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. అలాంటి ఆయన్ని ఇప్పటిదాకా చూడలేదు. సూపర్ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఎప్పుడూ రిహార్సిల్స్ చేస్తూనే ఉంటారు అని చెప్పింది.