Thandel Trailer : నాగచైతన్య – సాయి పల్లవి ‘తండేల్’ ట్రైలర్ వచ్చేసింది.. శ్రీకాకుళం యాసలో అదరగొట్టారుగా..
తాజాగా నేడు తండేల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

Naga Chaitanya Sai Pallavi Thandel Movie Trailer Released
Thandel Trailer : నాగచైతన్య – సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మాణంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, గ్లింప్స్ రిలీజ్ అవ్వగా తాజాగా నేడు ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ చూస్తుంటే.. హీరో హీరోయిన్స్ ప్రేమ కథతో మొదలయి హీరో వేటకు వెళ్ళే వాళ్ళందరికి తండేల్ గా ఎన్నికవడం, వేటకు వెళ్లాలని చూస్తే హీరోయిన్ వద్దనడం, వేటకు వెళ్ళాక అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి వాళ్లకు చిక్కడం, అక్కడ్నుంచి హీరో – మిగిలిన వాళ్ళు ఎలా బయటపడ్డారు అని ప్రేమతో పాటు థ్రిల్లింగ్ అంశాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.
Also Read : Comedian Ali : మరోసారి పెళ్లి చేసుకున్న కమెడియన్ అలీ.. వీడియో వైరల్.. దగ్గరుండి పెళ్లి చేసిన కూతుళ్ళు..
ఈ సినిమాని శ్రీకాకుళంకు చెందిన పలువురు మత్స్యకారుల రియల్ జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు. సినిమాని కూడా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. యాక్షన్ సీన్స్ కూడా భారీగా ఉన్నట్టు తెలుస్తుంది. చైతూ, సాయి పల్లవి శ్రీకాకుళం యాసలో మెప్పించబోతున్నారని తెలుస్తుంది.