Actress Divya Khosla kumar shocking comments on Bollywood
Divya Khosla: బాలీవుడ్ ఇండస్ట్రీపై నటి దివ్య ఖోస్లా షాకింగ్ కామెంట్స్ చేసింది. అక్కడ అంతా ముసలోళ్లతో నిండిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఈ బ్యూటీ ఓ ఆస్క్ మీ ఎనిథింగ్ అనే సెషన్ లో పాల్గొంది. ఇందులో భాగంగా ఆమె తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇందులో భాగంగా ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఇలా మాట్లాడింది. బాలీవుడ్ అంతా ముసలోళ్లతో నిండిపోయింది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
ఇక్కడ నిజాయితీగా ఉండటం చాలా అవసరం. సినిమాల అవకాశాల కోసం ఆత్మ గౌరవాన్ని అమ్ముకోలేను. ఒక సినిమా కోసం యూకేలో జీరో డిగ్రీ టెంపరేచర్‌లో 42 రోజులు పని చేశాను. అది నా కెరీర్ లోనే షూట్. మరోసారి మైనస్ 10 డిగ్రీలలో కూడా ఆగకుండా పని చేశాను. ఆ సన్నివేశాలు నాకు బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేశాయి’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అలాగే తన విడాకుల గురించి కూడా మాట్లాడింది దివ్య ఖోస్లా(Divya Khosla). మీరు విడాకులు తీసుకున్నారా అని ఒకరు అడగగా.. “విడాకుల వార్తల్లో నిజం లేదు. కానీ, మీడియా అలా కావాలని కోరుకుంటుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.